తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఎక్కడ లేని పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సాధారణంగా ఏ హీరోకైనా కొన్ని సినిమాల తర్వాత కానీ అభిమానులు పేరుకు ముందు ఏదో ఒక బిరుదు తో సంబోధిస్తారు. కానీ తనకు తానే ‘బర్నింగ్ స్టార్’ అని పేరుతో వచ్చిన ఏకైక నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంపూ తర్వాత సింగం 123 సినిమాతో కడుపుబ్బా నవ్వించాడు. తాజాగా  సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ఈ మద్య కొబ్బరి మట్ట టీజర్ ఒకటి విడుదలైంది..ఇందులో పెదరాయుడిగా సంపూ ఆడవారి గురించి ఏకబిగిన కొట్టిన డైలాగ్ కి అందరూ ఫిదా అయ్యారు.

అయితే విడుదలైన తొలి రోజే ఈ టీజర్ కు మూడు లక్షల వ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ హ్యపీ మూడ్ లో ఉంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు మూవీ మేకర్స్.  ఈ పోస్టర్ లో 'ముందుగా వస్తున్నాను అని చెప్పుకునే తుఫాను కాదతను, వచ్చాక చెప్పుకునే సునామి అతను' అని సంపూర్ణేష్ గురించి గొప్పగా తెలపడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: