మామూలుగానే బ్యాక్ బెంచ్ అనగానే తరగతి గదిలో అల్లరి బ్యాచ్ కి కేరాఫ్. చదువు ఒంట పట్టక... అమ్మానాన్నల మాటలు చెవికి పట్టక... కాస్త బద్ధకంతో జీవితాన్ని కాస్త ఎంజాయ్ మెంటుతో జీవితాన్ని నెట్టుకొచ్చేద్దాం అనుకునే కేసులన్నీ క్లాసుల్లో వెనక బెంచీలకే చేరతాయి. ఆ కుర్రాడు కూడా అంతే. వెనక బెంచీలో కూర్చుని కునుకుపాట్లు పడుతూ ఉంటారు. అమ్మాయిల గురించి పగటి కలలు కనేస్తుంటారు. ఇలా కలలు కంటూ ఉండగానే నాలుగేళ్లూ గడిపోతాయి. ఆ కలల ఫలితంగా మొత్తం సబ్జెక్టులన్నీ చెట్టెక్కిపోతాయి. ఈలోగా ఓ ప్రేమాయణాన్ని వెలగబెడతాడీ హీరో. మరి, చదువులో ఫెయిలైన ఈ కుర్రాడు... ప్రేమలో పాస్ అయ్యాడా. అక్కడ పాస్ అవడం కోసం ఏం చేశాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ చిత్రానికి దర్శకుడు మధుర శ్రీధర్. హీరోగా మహత్ నటిస్తున్నాడు. పియా బాజ్ పాయ్, అర్చనా కవి హీరోయిన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: