సినిమా హీరో అనగానే ఎన్నో సాహసకృత్యాలు చేస్తూ కనిపిస్తుంటారు..ఇక టార్జన్ లాంటి సినిమాలైతే జంతువులతో పూర్తిగా మమేకమై కనిపిస్తుంటారు. సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లతో సహవాసం చేస్తారు.  ఇక హాలీవుడ్ సినిమాల్లో అయితే జంతువులతో చేసే సాహసాలు చాలా కామన్ గా ఉంటాయి. కానీ నిజజీవితంలో అటవీ ప్రాంతంలో వెళ్తుంటే..ఓ గజరాజు ఎదురై వెంటపడితే ఒక్కసారి ఊహించుకోండి..అయితే అచ్చూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఓ హాలీవుడ్ హీరోకి..ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..! ఒకప్పుడు హాలీవుడ్ లో కండల వీరుడిగా పేరు తెచ్చుకున్నఆర్నాల్డ్ .

వివరాల్లోకి వెళితే.. హీరో  ఆర్నాల్డ్ తన మిత్ర బృందంతో కలిసి ఆఫ్రికా ఫారెస్ట్ లోకి వెళ్ళాడు.  అక్కడ ఓ భారీ ఏనుగు ఆర్నాల్డ్ జీప్ కి దగ్గరగా రావడంతో జీప్ ని ఆపేశారు . అయితే కొద్ది నిమిషాల పాటు ఆ ఏనుగు జీప్ చుట్టూ తిరుగుతూ తొండం కారుపై వేస్తూ చాలా కోపంగా చూసింది. ఇక ఆర్నాల్డ్ తో సహా కారు లోపల ఉన్న ఆర్నల్డ్ బృందానికి పై ప్రాణాలు పైకే పోయాయట.

అలా కొద్ది సేపు తర్వాత ఏనుకు పక్కకు వెళ్లింది..బతుకు జీవుడా అనుకొని జీప్ ని కాస్త  రన్ చేసి కాస్త వేగం పెంచగా  కొద్ది దూరం వీరి జీప్ ని వెంబడిస్తూ ఇంకాస్త భయపెట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే వీరు అక్కడనుండి జారుకున్నారు. అయితే ఈ తతంగాన్నంతా వారు వీడియోగా చిత్రీకరించి అడవిలో తమ అడ్వంచర్ గురించి తమ తోటివారికి చూపించారట. అది కాస్త వైరల్ గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: