తెలుగు ఇండస్ట్రీలో లక్ష్మీకళ్యానం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కలువ కళ్ల భామ కాజల్ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ లీస్టులో చేరిపోయింది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు కావస్తున్న తన గ్లామర్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తపడుతూ యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. కాజల్ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది..అయితే మొదటి సినిమాలోనే గాఢమైన లిప్ లాక్ సీన్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే గతంలో సినిమాలో ఈ స్క్రీప్ట్ లేకపోయినా రణ్ దీప్ హుడా లిప్ లాక్ సీన్ చేసినట్లు తర్వాత అనుకోకుండా జరిగిపోయిందని సారీ కూడా చెప్పినట్లు చెప్పుకొచ్చింది కాజల్..కానీ ఇప్పుడు ప్లేట్ మార్చింది..అబ్బెబ్బే ఏదో చెబితే ఇంకేదో రాశారు మీడియా జనాలు అన్నారు. చివరకు అసలు స్క్రిప్ట్ లోనే ఉందని వతలి వ్యక్తికి తెలీకుండా ముద్దుపెట్టడం సాధ్యమేనా అని కూడా నిలదీసింది. ఈ స్టోరీ అంతా 'దో లఫ్జోం కీ కహానీ' సినిమాకి ఫ్రీ ప్రమోషన్స్ కోసం  ఈ భామ వేసిన స్కెచ్ అనే సంగతి జనాలకు బాగా అర్థమయ్యింది.

ఇక ఈ సినిమా రియల్ ప్రమోషన్స్ లో ఈ లిప్ లాక్ సీన్ గుట్టు విప్పింది. వాస్తవానికి  'దో లఫ్జోం కీ కహానీ' లిప్ లాక్ సీన్ ఉందని కానీ ఆ సీన్ చేయడానికి నేను భయపడ్డానని అంటుంది..దీనికి కారణం  'జిస్మ్2 మూవీలో రణ్ దీప్ కిస్సింగ్ సీన్లో లీనమై పోయినట్లు గాఢంగా చుంబిస్తాడని చాలా మంది అన్నారు..దీంతో నాకు కాస్త టెన్షన్ మొదలైందని అంత గట్టిగా ముద్దు పెట్టుకుంటాడేమో అన్నదే నా అసలు భయం వేసిందని  అంటూ ఆ లిప్ లాక్ వెనక ఉన్న రహస్యాన్ని బయట పెట్టింది. ఏది ఏమైనా పెట్టింది ఒక ముద్దు.. చేసింది సింగిల్ షాట్.. కానీ దాన్ని మాత్రం విపరీతంగా వాడేసుకుంటున్నారు చిత్ర యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: