తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే మాస్ , క్లాస్ ప్రేక్షకుల బాగా ఇష్టపడే హీరో. తండ్రి ఎన్టీఆర్ వారసత్వంగా వచ్చినప్పటికీ తండ్రికి తగ్గ తనయుడిగా సాంఘిక,పౌరాణిక,జానపద చిత్రాల్లో తనదైన స్టయిల్ చూపించాడు బాలకృష్ణ. ఇక ఫ్యాక్షన్ తరహా చిత్రాలు కేవలం బాలకృష్ణ కోసమే తయారు చేశారా అన్ని పాత్రలు చేసి మెప్పించారు. తాజాగా ఆయన 100 వ చిత్రం చారిత్రాత్మక చిత్రంగా రూపొందబోతున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇక బాలకృష్ణ పుట్టిన రోజు రేపు అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు..అయితే అది ఇక్కడ కాదు..అమెరికాలో అవును బాలయ్య పుట్టిన రోజు ఈసారి అమెరికాలో జరుపుకోబోతున్నారు.

ఈ సందర్భగా  అభిమానులకు ఒక రోజు ముందే దిమ్మతిరిగిపోయే గిఫ్ట్ అందించారు. తన ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబంధించి అదిరిపోయే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అయితే బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణిగా ఫస్ట్ లుక్ లో అదిరిపోయాలే కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ మొదట నుంచి పోస్టర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతుంటారు. గతంలో వరుణ్ తేజ ‘కంచె’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కూడా అద్భుతంగా క్రియేట్ చేయించారు. బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో ఆయన గెటప్ సూపర్బ్.

వందలాదిమంది సైనికులు బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా.. రణరంగంలో పోరాడుతున్న ఉగ్రరూప శాతకర్ణి క్యారెక్టర్‌లో బాలయ్యని చూపించిన విధానాన్ని మెచ్చుకోవచ్చు. ఇక ఆ మద్య క్రిష్ ఓ ఇంటర్వ్యూలో అన్నట్లు త్వరలో బాలయ్య విశ్వరూపాన్ని చూపించబోతున్నాను అన్న విధంగా ఈ పోస్టర్ ని విడుదల చేయించినట్లుంది.  ‘శాతకర్ణి’ సినిమాలో తమ అభిమాన నటుడి గెటప్ ఎలా ఉండబోతుందని భావించిన నందమూరి ఫ్యాన్స్‌కి క్రిష్ బాలయ్య బర్త్‌డే కానుకగా అద్భుతమైన గిఫ్టునే అందించాడని చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: