ఇష్టం సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన శ్రీయ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ రేంజ్ కు ఎదిగింది. స్టార్ హీరోలతో పాటుగా కుర్ర హీరోలందరితో జతకట్టిన శ్రీయ కొద్దికాలం వెనుక పడ్డట్టు కనిపించినా ఇప్పుడు మళ్లీ మంచి ఫాంలోకి వచ్చింది. మనం, గోపాల గోపాల, ఊపిరి సినిమాల్లో చేసింది చిన్న రోల్స్ అయినా శ్రీయా ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంది.


శ్రీయ హాట్ లుక్స్ :


ఇక అదే అమ్మడికి ఓ లక్కీ ఆఫర్ ను తీసుకొచ్చింది. నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రాణి పాత్రకు ఎవరైతే బాగుంటారా అన్న ఆలోచనతో ముందు నయనతార, అనుష్క లాంటి వారి పేర్లు వినపడ్డా ఫైనల్ గా సినిమాలో శ్రీయను ఓకే చేశాడట దర్శకుడు క్రిష్. 


ఈ సినిమాలో నటించేందుకు కొత్త హీరోయిన్ పనికిరాదు అభినయం వచ్చిన నటి కావాలి అందుకే క్రిష్ శ్రీయను తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం డేట్స్ అంతా ఖాళీగానే ఉన్న శ్రీయాకు ఇదో లక్కీ ఆఫర్ అంతేకాదు ఇంతటి పెద్ద సినిమా కోసం అయినా సరే ఆమెకు కేవలం 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తున్నట్టు తెలుస్తుంది. 


గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ :


మరి సినిమా బడ్జెట్ చూస్తేనేమో 50 కోట్ల పై మాటే మరి శ్రీయాకు మరి అంత చీప్ గా తీసుకున్నారే అంటే ఆమెకు అవకాశం రావడమే గొప్ప విషయం అందుకే ఆమె కూడా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి అసంతృప్తిఒ వ్యక్తం చేయలేదట. సో మొత్తానికి గౌతమిపుత్ర శాతకర్ణిలో శ్రీయా రాణిగా కనిపించనున్నదన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: