సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని నమ్మకాలు మరే రంగంలోను ఉండవు.  ఆశించిన స్థాయిని అందుకోలేక పోతే సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఏదోవిధంగా తమకు లక్ కలిసి వస్తుందని ఎదురు చూసే వారి సంఖ్య అనేకం.  ఈ నేపధ్యంలో పేరు మార్చుకుంటే లక్ కలిసొస్తుందనే నమ్మకంతో  చాలా మంది ఉంటారు .

దీనికోసం తమ పేరులోని స్పెల్లింగ్ లో అక్షరాలను తొలగించడమో లేదా కొత్తగా అక్షరాలను యాడ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. అయితే మొత్తంగా పేరు మార్చేసుకుని మళ్లీ ఫ్రెష్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు కూడ ఉన్నారు . ఇప్పుడు ఆ కోవలోకి ఎమ్ ఎమ్  కీరవాణికి సోదరుడైన కళ్యాణి మాలిక్ చేరబోతున్నాడు.

కోరస్ సింగర్ నుంచి ప్లే బ్యాక్ సింగర్ గా అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన ఈయన  'అష్టా చెమ్మా' 'అలా మొదలైంది', 'ఊహలు గుసగుసలాడే' లాంటి హిట్  సినిమాలకు సంగీత  దర్శకత్వ్యం వహించినా ఎందుకో ఆయనకు చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు. దీనితో ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ తన అదృష్టాన్నిపరీక్షించుకుంటూనే ఉన్నాడు ఈ సంగీత దర్శకుడు.

మొదటగా కళ్యాణి మాలిక్, ఆ తర్వాత కళ్యాణి కోడూరి, ఆ పై  కోడూరి కళ్యాణ్, ఇప్పుడు కళ్యాణ రమణ ఇలా ఇప్పటికి నాలుగుసార్లు పేర్లు మార్చుకుని టాలీవుడ్ లో సంచలనాలుసృట్టిస్తున్నాడు. ఈ మధ్య ఆయన మ్యూజిక్ అందించిన ''కళ్యాణ వైభోగమే'' సినిమా  హిట్ అయిన తరువాత ఆయన   ఇక తన కోడూరి కళ్యాణ్ అనే పేరును ఇక మార్చుకోబోనని గట్టిగానే చెప్పాడు. కానీ ఏమైందో తెలియదు కాని మళ్ళి ఆయన మూడ్ మారిపోయి  కళ్యాణ్ రమణ అనే పేరుతో  తన లేటెస్ట్ సినిమా ‘జో  అచ్యుతానంద’  మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఏదిఎలా ఉన్నా కీరవాణి సోదరుడి జాతకాల నమ్మకం ప్రస్తుతం టాలీవుడ్ కు హాట్ టాపిక్ గామారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: