బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే కెరియర్ ఆరంభం నుండి సూపర్ క్రేజ్ సంపాదించింది. ఇక చేస్తున్న సినిమాలు కూడా హిట్ల మీద హిట్లు పడుతుండటంతో అమ్మడు స్టార్ గా అవతరించింది. అందం అభినయం ఉన్న దీపికా హీరోలతో రొమాంటిక్ సీన్స్ కు కూడా వెనుకాడదు. అందుకే ఆమె కోసం అభిమానులు అంతగా ఉర్రూతలూగేది. ఇక దర్శక నిర్మాతలైతే తమ సినిమాలో దీపికా ఉందంటే సినిమాకో స్పెషల్ ఎట్రాక్షన్ ఉందనే భావనలో ఉంటారు.


దీపికా హాట్ స్టిల్ :


అయితే హీలీవుడ్ ఛాన్స్ కూడా కొట్టేసిన దీపికా త్రిపుల్ ఎక్స్ సినిమాలో నటిస్తుంది. ఆ ఆఫర్ వచ్చిందో లేదో ఇక రెమ్యునరేషన్ విషయంలో ఇక్కడి వారికి చుక్కలు చూపెడుతుందట. ఓ పక్క సినిమాల్లో చేస్తూనే వాణిజ్య ప్రకటనల్లో నటించడం బాలీవుడ్ హీరోయిన్స్ కు మాములే. ఆ క్రమంలో దీపికా కూడా ఇప్పటిదాకా చాలా యాడ్స్ లో నటించింది.


ఇక హాలీవుడ్ హీరోయిన్ అయిన ఈ అమ్మడిని తాజాగా ఓ యాడ్ గురించి నిర్వాహకులు మీట్ అవ్వగా రోజుకు రెండు కోట్లిస్తే తప్ప ఆ యాడ్ లో నటించేది లేదు అని తెగేసి చెప్పిందట. దీపికా అడిగిన రెమ్యునరేషన్ కు ఒక్కసారిగా షాక్ అయిన యాడ్ నిర్వాహకులు ఎలాగోలా ఆమెను ఆ ప్రాజెక్ట్ మొత్తానికి 8 కోట్లకు ఒప్పించారట.


యాడ్ లో దీపికా పదుకొనే :  


సో అలా బాలీవుడ్లో ఇన్ని సినిమాలు చేసినా యాడ్స్ లో చూసి తీసుకునే దీపికా పదుకునే ఒక్క ఇంగ్లీష్ సినిమాలో నటించిందో లేదో ఆకాశాన్నంటే పారితోషికంతో బెంబేలెత్తేలా చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో సినిమాలకు కూడా అంతే భారీ డిమాండ్ చేస్తే ఇక ఆమెను పక్కన పెట్టి వేరే బ్యూటీలకు అవకాశం ఇచ్చేస్తారు దర్శక నిర్మాతలు. మరి అది గుర్తుంచుకుని అమ్మడు కాస్త రెమ్యునరేషన్ విషయంలో పట్టు విడుపులు చేస్తే బెటర్ లేదంటే అసలకే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: