మెగా డాటర్ నీహారిక యంగ్ హీరో నాగశౌర్య జంటగా నటించిన ఒక మనసు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో రిలీజ్ కు కౌంట్  డౌన్ మొదలు అయింది. ఈ సినిమా చూసిన సెన్సార్ వారు ఈసినిమాను మేచ్చుకవడమే కాకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తమ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా తమ సినిమా సెన్సార్ పూర్తయిందని ఈసినిమా యూనిట్ వర్గాలు పండుగ చేసుకుంటున్నట్లు టాక్. 'ఫ్రెండ్స్ ‘ఒక మనసు’ ఎటువంటి కట్స్ లేకుండా ‘యు’ సర్టిఫికెట్ పొందింది. 24న విడుదలకు సర్వం సిద్ధం మీ ఆశీర్వాదాలు కావాలి' అంటూ నిర్మాత మధుర శ్రీధర్ ట్వీట్ చేశాడు. అంతే కాదు ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడ విడుదల చేసారు.  

దర్శకుడు రామరాజు ప్రతిభ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన మంచి ట్యూన్స్ ఈ సినిమాను నిలపెడతాయి అని అంటున్నారు. రిలీజ్ కి 10 రోజుల ముందే సెన్సార్ ను కంప్లీట్ చేసి ఫైనల్ కాపి సిద్ధం చేసుకున్న ‘ఒక మనసు’ యూనిట్ ఈవీక్ ఎండ్ నుండి తన ప్రమోషన్ కార్యక్రమాల పై చాలా భారీ స్థాయిలో  దృష్టి పెట్టబోతోంది. అయితే టీజర్ లోనే అన్ని ముద్దులుంటే ఈసినిమాకు ‘యు' ఎలా వచ్చింది అంటూ కొందరు ఈసినిమా పై సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పటి వరకు తెలుగు సినిమా రంగంలో రాని ఒక బోల్డ్ లవ్ స్టోరీ ‘ఒక మనసు’ అని చెపుతున్నారు కాబట్టి ఆ ముద్దు సీన్స్ సెన్సార్ దృష్టికి రాలేదు అనుకోవాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినా ఈసినిమా పై సాధారణ ప్రేక్షకులలో ఇంకా హైక్ రాకపోవడం ఈ సినిమా యూనిట్ ను కలవర పెడుతోంది అని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: