స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ రూట్ సెపరేట్ అని చెప్పాలి. తనకు నచ్చిన వారికి తగిన అవకాశాలిస్తూ ఇప్పటికే తన స్నేహితులుగా పెద్ద గ్యాంగ్ తయారు చేసుకున్న జూనియర్ ఇప్పుడు వారికి అవకాశాలను ఇవ్వడంలో కూడా ముందున్నాడు. ఎన్నాళ్ల నుండో వక్కంతం వంశీ తన కోసం కథ సిద్ధం చేసుకుని పెట్టుకోగా ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్ ఆ సినిమాకు కెమెరా మన్ గా తిరుని రిఫర్ చేశాడట.


ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న తిరు వర్కింగ్ స్టైల్ నచ్చిన తారక్ ఇతన్నే వక్కంతం వంశీ సినిమాకు ఓకే చేశాడట. ఓ బడా ప్రొడ్యూసర్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే జనతా గ్యారేజ్ కూడా షూటింగ్ సక్సెస్ ఫుల్ గా చేసుకుంటుంది.


ఇక గ్యారేజ్ ఫస్ట్ లుక్ కే ఓ రేంజ్ హిట్ టాక్ రావడంతో సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా అన్ని అంశాలు పొందుపరుస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పటికే సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యాడ్ అవడంతో సినిమా మరింత క్రేజ్ సంపాదించింది. ఇక సినిమాలో హీరోయిన్స్ సమంత నిత్యాలు కూడా తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.


సమంత ఈ సినిమాలో ఎన్నడు చూడని హాట్ అప్పీల్ తో కనబడుతుందని రీసెంట్ గా జనతా గ్యారేజ్ నుండి సమంత పిక్ చూస్తే అర్ధమవుతుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో ల సక్సెస్ తర్వాత జనరా గ్యారేజ్ ను ఆ రెండిటి కంటే పెద్ద హిట్ కొట్టేందుకు ఎన్టీఆర్ 24 గంటలు కష్టపడుతున్నాడట. మరి జూనియర్ అనుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా కొడుతుందో లేదో తెలుసుకోవాలంటే ఆగష్టు 12 దాకా వెయిట్ చేయాల్సిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి: