సినిమా సెలెబ్రెటీల నమ్మకాలు సెంటిమెంట్ల పై ఎప్పుడూ సెటైర్లు పడుతూనే ఉంటాయి. అయినా ఆ నమ్మకాల ఉచ్చు నుండి మన సెలెబ్రెటీలు బయటకు రాలేరు. ఈ విషయంలో బ్రహ్మానందం నమ్మకాలకు సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫైలిo నగర్ లో హడావిడి చేస్తోంది. ప్రస్తుతం బన్నీకి టైమ్ కలిసి రావడం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. 

బ్రహ్మీ మంచికి వెళ్ళినా చెడు ఎదురౌతోందని బ్రహ్మానందం తన సన్నిహితుల వద్ద బాధ పడుతున్నాడట. తన కొత్త ఇంటికి వెళ్ళిన తరువాత కెరియర్ పరంగా సమస్యలు మరింత ఎక్కువయ్యాయని బ్రహ్మీ తెగ బాధ పడుతున్నట్లు టాక్. వాస్తు సిద్ధాంతుల సలహా మేరకు తన జర్నలిస్టు కాలనీ ఇంటి నుండి మణికొండలోని తన మరో ఇంటికి వెళ్ళినా తన సమస్యలు మరింత పెరిగి పోవడంతో తన పూర్వపు ఇల్లు జర్నలిస్టు కాలనీ ఇంటికే వెళ్ళి పోవాలని బ్రహ్మీ మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

బ్రహ్మీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో కారణం ఉంది అని అంటున్నారు. తాను ప్రస్తుతం ఉంటున్న మణికొండ ఇంటి నుండి షూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి సమయం చాల వృథా అయిపోతున్న నేపధ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా ఈ ఇల్లు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా  మరో గాసిప్పు బ్రహ్మీ పై చక్కర్లు కొడుతోంది. 

బ్రహ్మానందాన్ని సినిమాలలో తీసుకోవద్దని నాగార్జున తనకు తెలిసిన సన్నిహితుల వద్ద కామెంట్ చేస్తున్నట్లు టాక్. దీనికి కారణం ‘సోగ్గాడే చిన్నినాయన’ షూటింగ్ సమయంలో బ్రహ్మానందం కొన్ని సీన్స్ షూటింగ్ కు బ్రహ్మీ డుమ్మా కొట్టడంతో డూప్ పెట్టి ఏదోవిధంగా ఆ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేశారట. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న నాగ్ కోపంతో తన సన్నిహితుల వద్ద ఇలా కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ప్రస్తుతం వస్తున్న ఈ గాసిప్పులను బట్టి నిజంగానే బ్రహ్మీకి బ్యాడ్ పిరియడ్ రన్ అవుతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: