తెలుగు సినిమా పరిశ్రమ సీనియర్ నటుడు జెవి రమణమూర్తి కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. నాటక రంగం నుండి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రమణమూర్తి గారు దాదాపు ఇప్పటి వరకు 150 సినిమాల దాకా నటించారు.


ఎన్‌జీవో, ఎవరు దొంగ, కప్పలు, నాటకం, కీర్తి శేషులు, కాలరాత్రి, ఫణి వంటి నాటకాల్లో నటించిన రమణమూర్తి గారు.. గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని ఎంతో ఇష్టపడి తన దర్శకత్వంలోనే ఎన్నో వేల సార్లు అది ప్రదర్శితం చేశారట. ఎమ్మెల్యే అనే సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసిన ఆయన మాంగల్య బలం, బాటసారి, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, ఆకలి రాజ్యం, సప్తపది, ఆంధ్ర కేసరి, ఆనంద భైరవి, కర్తవ్యం, ఆర్య సినిమాల్లో నటించారు. రమణమూర్తి చివరి సినిమా శంకర్ దాదా జిందాబాద్.  


శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రేక్షకుల్లో ఒక స్థానం సంపాదించుకున్న జెవి సోమయాజులకు సోదరుడు ఈ రమణమూర్తి. రమణమూర్తి స్వస్థలం విజయనగరం.. ఆయన మృతి పట్ల సిని ప్రముఖులంతా  సంతాపం తెలియచేశారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: