తేనె కళ్ళ సుందరిగా దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న శ్రుతిహాసన్ ఈమధ్య కాలంలో అనేక ఫ్యాషన్ మ్యాగ్  జైన్స్ కు విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇస్తున్న ఫోటో షూట్స్ ను చూసి శ్రుతి తండ్రి కమలహాసన్ తీవ్ర అసహనంలో ఉన్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. జాతీయ నటుడుగా అన్ని భాషల సినిమాలలోను నటించిన కమల్ ఇమేజ్ కి శృతి ఫోటో షూట్స్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని టాక్. 

అంతేకాదు ఏమి చేయలేని స్థితిలో కమల్ ఉండిపోయాడా  ? అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. శ్రుతిహాసన్ లేటెస్ట్ గా ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. ఈ మ్యాగ్ జైన్ కోసం చిట్టిపొట్టి డ్రెస్ లతో ఒక ఫోటో షూట్ ను కూడ ఇచ్చింది. 

ఈ విషయంలో ట్విస్ట్ ఏమిటంటే శ్రుతి ఈమధ్య తన తండ్రితో కలిసి కమలహాసన్ తీస్తున్న ‘శభాష్ నాయుడు’  షూటింగ్ కోసం అమెరికాలో ఉంటూ ఉండగానే ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఖాళీ టైమ్ లో ఇలా అమెరికా నుంచే ‘ఫెమినా’ మ్యాగ్ జైన్ కోసం ఇలాంటి  హాట్ ఫోటో షూట్ ఇవ్వడం  ఇప్పుడు టాపిక్ అఫ్ ది కోలీవుడ్ గా మారింది. దీనితో ఈ ఫోటో  షూట్ చూసిన కమల్ హాసన్ అభిమానులు తండ్రి సూపర్ స్టార్  గా సినిమాలలో కొనసాగుతున్నా ఆ విషయాలు పట్టించుకోకుండా ఇలా శృతిమించి ఎక్స్ పోజ్  చెయాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

అంతేకాదు ఎక్స్ పోజింగ్ చేయవచ్చు కానీ మరీ బట్టలు వేసుకోవడమే దండుగ అన్నట్లు శృతి  ప్రవర్తించాల అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే ఎవరినీ లెక్క చేయని  మనస్థత్వం ఉన్న శృతి హాసన్ ఈ కామెంట్స్ ను లెక్క చేయక  పోవచ్చు..



మరింత సమాచారం తెలుసుకోండి: