ప్రస్తుతం టాప్ హీరోలే కాదు సుమారు రేంజ్ ఉన్న హీరోలు కూడా ఓవర్సీస్ కలక్షన్స్ పై ఆధారపడుతున్నారు. అక్కడ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. అయితే స్టార్స్ కూడా ఓవర్సీస్ లో సత్తా చాటలేని విధంగా నాని తన క్రేజ్ కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన జెంటిల్ మన్ సినిమా రిలీజ్ అయిన వారంతరమే హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది.


భలే భలే మగాడివోయ్ కంటే ముందు నాని మార్కెట్ సోసోగా ఉండేది. కాని మారుతి మ్యాజిక్ తో భలే భలే మగాడివోయ్ సినిమా ఓవర్సీస్ లో ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసి చేసింది. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాథ కూడా నానికి 8 లక్షల డాలర్స్ వరకు తెచ్చిపెట్టింది. 


అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన జెంటిల్ మన్ కూడా నాని సత్తా ఏంటో నిరూపించింది. మరోసారి నాని అక్కడ ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్నాడు. అందుకే సినిమా రిలీజ్ అయిన వీకెండ్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటిన నాని జెంటిల్ మన్ తర్వాత స్లో అయినా మళ్లీ రెండో వారాంతరం కలక్షన్స్ పుంజుకున్నాయి. ఇక మధ్యలో ఒక మనసు అంటూ నిహారిక వచ్చినా సరే బాక్సాఫీస్ మీద అంత ప్రభావితం చూపించలేకపోయింది.


అందుకే జెంటిల్ మన్ నాని కలక్షన్స్ కుమ్మేస్తున్నాడు. ఇప్పటి వరకు 8 లక్షల డాలర్స్ దాకా వసూళు చేసిన నాని మరో రెండు వారాల దాకా సినిమాలేవి లేవు కాబట్టి మిలియన్ మార్క్ టచ్ చేస్తాడేమో చూడాలి. మొత్తానికి నాని ఓవర్సీస్ లో కలక్షన్స్ కింగ్ అనిపించుకుంటున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: