సినిమాల్లో హీరోగా ఒక్కసారైనా కనిపించాలని ఎవ్వరికైనా ఉంటుంది..కానీ దానికి అదృష్టం..సినీ కుటుంబ నేపథ్యం ఉంటే అది కూడా అన్నీ కలిసి వస్తే..హీరో అవుతారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసుల హవా కొనసాగుతుంది. ముఖ్యంగా మెగాస్టార్, నందమూరి,అక్కినేని,దగ్గుబాటి, మంచు వారి కుటుంబాల నుంచి హీరోలుగా వస్తూ తమ ప్రాభల్యం చూపిస్తున్నారు. ఇక మెగాస్టార్ కుంటుంబం నుంచి అయితే దాదాపు అరడజను కంటే ఎక్కువే హీరోలు వచ్చారు..వచ్చిన ప్రతి హీరో తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంతే కాదు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు వారసురాళ్ల ఎంట్రీ కూడా మొదలైంది..ఇప్పటికే నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ కూడా సినీ రంగా ప్రవేశం చేయాలనే చూస్తున్నారు..అయితే హీరోయిన్ గా కాకుండా ఇతర విభాగాల్లో పనిచేయాలని ఉత్సాహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్న అల్లుడు శ్రీజ భర్త అయిన కల్యాణ్ ఫిల్మ్ ఇండస్ర్టీలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కూతురు శ్రీజ.. ఈ విషయమై ఫాదర్ చిరు చెవిలో వేసిందట. అల్లుడి మాట కాదనలేక సరేనంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని ఫిల్మ్‌నగర్ సమాచారం.

ఫిజిక్, లుక్స్ విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటున్నాట్లు..యాక్షన్, ఫైట్స్, డ్యాన్స్ విషయాల్లో కూడా ప్రత్యేక ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఫ్యామిలీ నుంచి సపోర్టు, మెగా ఫ్యాన్స్ అండ.. ఇలాంటివి తమకు కలిస్తుందని, సక్సెస్ అవుతాననే నమ్మకంతో ఉన్నాడట కల్యాణ్. ఈ విషయమై చిరు, ఇండస్ర్టీలో తనకున్న రిలేషన్స్‌తో అల్లుడ్ని పైకి తీసుకురావాలని స్కెచ్ వేస్తున్నాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: