తమిళం లో ఒక స్టార్ హీరో కి ఎంత డిమాండ్ ఉంటుందో ఎంత రెవెన్యూ ఒస్తుంది ఆ రేంజ్ లో కలక్ట్ చెయ్యగల హీరోయిన్ నయనతార. ఆమె ఫాలోయింగ్ ఇప్పుడు సాదా సీదా హీరోయిన్ ల రేంజ్ ని దాటేసి దూసుకుని పోతోంది. పెద్ద హీరోలు కనీసం ఆమె పక్కన కూడా అనట్లేదు. ఇప్పుడు ఆమె చిన్న హీరోల పాలిట వరంగా మారుతోంది. ఆమె అడుగు పెట్టిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ ముద్ర పడాల్సిందే. వరసగా దాదాపు ఏడెనిమిది హిట్ లు కొట్టేసిన ఆమె తమిళం లో స్టార్ హీరోయిన్ స్టేటస్ వెలగబెడుతోంది.

 

కానీ తమిళం లో ఆమె ఉన్న పరిస్థితి కి ఎక్జాట్ ఆపోజిట్ లో ఉంది తెలుగు లో పరిస్థితి. ఇక్కడ అన్నీ ప్లాపులే. ఆ మధ్య కహానీ ని రీమేక్ చేస్తూ శేఖర్ కమ్ములతో తెలుగు లో సినిమా చేసి భారీ ప్లాప్ ని చవి చూసింది. ప్రస్తుతం తెలుగు లో మారుతి - వెంకటేష్ ల సినిమా బాబు బంగారం మీద బాగా ఆశలు పెట్టుకున్న నయనతార ఈ సినిమా అవుట్ పుట్ కి ఫిదా అయ్యిందట. ఇప్పటివరకు ఈమె ఇచ్చిన డేట్లన్నీ వాడేసుకోవడంతో.. ఇప్పుడు ''బాబు బంగారం'' సినిమా కోసం మరిన్ని డేట్లు ఎడ్జస్ట్ చేసుకోలేకపోతోందట నయన. కాని దర్శకుడు మారుతి మాత్రం మరో 10 రోజులు ఈమె కాల్ షీట్లు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా తమిళం లో చేతినిండా సినిమాలతో బిజీ గా ఉండడం తో ఆమెకి తెలుగు లో డేట్ లు అడ్జుస్ట్ చెయ్యడం తలకి మించిన భారంగా మారింది అంటున్నారు.

 

కానీ ఆమె డేట్ లు ఇస్తే గానీ బాబు బంగారం షూటింగ్ ఇంకా పూర్తీ అయ్యేలా కనపడ్డం లేదు. ఇప్పటికే విడుదల తేదీ ని 29 జూలై అని ప్రకటించుకుని కూర్చున్నారు సినిమా బృందం వారు. ఈ పరిస్థితి లో ఆమె నే నమ్ముకున్న మారుతి చాలా అసహనంతో ఉన్నాడట. తెలుగు లో ప్లాపుల్లో ఉన్న ఆమెకి మంచి బ్రేక్ ఇద్దాం అని తాను అనుకుంటూ ఉంటె కాల్ షీట్ లు కూడా సరిజేసుకోలేకుండా ఆమె ఇబ్బంది పెట్టడం మారుతి తో పాటు వెంకటేష్ కి కూడా నచ్చని వ్యవహారం. కొన్ని సీన్ లు కట్ చెయ్యచ్చు గానీ కీలకమైన హాస్పిటల్ సీన్ ఇంకా అసలు షూటింగ్ కూడా చెయ్యలేదట ఈ సీన్ లో నయనతార ది ముఖ్య పాత్ర ఉంది అనీ ఆమె ఈ టైం లో హ్యాండ్ ఇస్తే చాలా కష్టం అనీ అంటున్నారు. ఒకరకంగా నయనతార - మారుతి మధ్యన కోల్డ్ వార్ నడుస్తోంది అని ఫిలిం నగర్ లో టాక్.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: