దర్శకుడు జి. ఈశ్వర్ రెడ్డి తన తొలి సినిమా ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ తో  హిట్ కొట్టినా లేటెస్ట్ గా అల్లరి నరేష్ తో సెల్ఫీరాజా అంటూ అల్లరి చేయించడానికి  ఎల్లుండి  అల్లరోడిని థియేటర్స్ లోకి దించుతున్నాడు. ఈ మధ్య కాలంలో పరాజయాలు చూసిన ఈదర్శకుడు అల్లరి నరేష్ తో స్పూఫ్ లు లేకుండా ఈ సినిమా తీశానని చెపుతున్నాడు.  
 
దీనితో ‘సెల్ఫీ రాజా’ లో స్పూఫ్ లు లేవని చెపుతున్నప్పుడు అల్లు అర్జున్ అన్న  ‘చెప్పను బ్రదర్’ డైలాగ్ ను ఎలా వాడుకున్నారని మీడియా వర్గాలు ప్రశ్నించి నప్పుడు ఈదర్శకుడు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఈ డైలాగ్ ఈ స్క్రిప్ట్ లో పెట్టే సమయానికి  అల్లు అర్జున్  వివాదం  జరగలేదని అయితే బన్నీ అనుకోకుండా ఇదే డైలాగ్ అనడంతో బాగా పాపులర్ అయిన ఈ డైలాగ్ ను వాడుకున్నామని  చెపుతున్నాడు.

అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ అంశాన్ని నెగిటివ్ గా తీసుకోరు అనే ధైర్యంతో తాము ఈడైలాగ్ ను ఈసినిమాలో కొనసాగించామని  చెపుతున్నాడు ఈ దర్శకుడు. అల్లరి నరేష్ చాలామంది స్టార్ హీరోలను ఇమిటేట్ చేశాడని అప్పుడెప్పుడు రాని తేడాలు ఇప్పుడు వస్తాయని అనుకోవడం లేదంటూ బన్నీ అభిమానులు కూడ అల్లరి నరేష్ ను అభిమానిస్తారు కాబట్టి ఈ డైలాగ్ వల్ల ఈ సినిమాకు ఎటువంటి హానీ జరగదు అంటూ ఆశక్తికర కామెంట్స్ చేసాడు నాగేశ్వరరెడ్డి. 

ఎల్లుండి విడుదల అవుతున్న ఈ సినిమా పై ఫిలింనగర్ లో మంచి పాజిటివ్ టాక్ ఉన్నా ఈ సినిమా ప్రమోషన్ చాలా చిన్నస్థాయిలో జరగడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన అల్లరి నరేష్ ఈ సినిమా నిర్మాతలకు గట్టి క్లాసు తీసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: