నట సింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా షూటింగ్ ఫాస్ట్ గా సాగుతోంది. యుద్ధాల మీద యుద్ధాలు చేయిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుంచీ యుద్ధాల షూటింగ్ లో నడుస్తున్నాయి. తొలుత మొరాకో లో షూటింగ్ చేసారు, ఆ తరవాత గండిపేట దగ్గర భారీ సెట్ వేసి హైదరాబాద్ లో షూటింగ్ చేసారు , ఇప్పుడు క్లైమాక్స్ యుద్ధం చిత్రీకరణ కోసం అంటూ ఏకంగా జార్జియాలో యుద్ధాన్ని నిర్మిస్తున్నారు.

 

అన్నీ యుద్దాలేనా ఎక్కడా సీన్ లు కనపడ్డం లేదు. గ్రీకు వీరులతో పోరాటం లో బాలయ్య యమా బిజీ గా ఉన్నారు. కొండల మధ్యలో ఫోన్ లూ, ఇంటర్నెట్ , బయట ప్రపంచం తో సంబంధం లేని విధంగా షూటింగ్ చాలా సీక్రెట్ గా కానిచ్చేస్తున్నారు. అలాంటి సమయం లో బోర్ ఫీల్ అవుతారు కదా , బ్రేక్ సమయం లో అయినా ఏం చెయ్యాలో తోచని పరిస్థితి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జార్జియా కి చెందిన చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.వారందరూ కూడా జార్జియన్ బాష లో ఫోక్ పాటలు పాడుతూ ఉంటె క్రిష్ అతని బృందం ఈ పాటలు ఎంజాయ్ చేస్తున్నారట. వారి పాటలు బాలయ్య కీ తమ బృందానికీ తెగ నచ్చేసాయి అనీ లోకల్స్ మాట్లాడే భాష తమకి అర్ధం కాకపోయినా కూడా అ పాటలు బాగా నచ్చుతున్నాయి అని డైరెక్టర్ క్రిష్ స్వయంగా చెబుతున్నారు.

 

త్వరలో జార్జియా ఎపిసోడ్ ముగిసిపోయేలా ఉంది అనీ అది అయిన తరవాత ఇండియా వచ్చేస్తాం అనీ చెబుతున్నారు. క్రిష్ పెళ్లి తరవాత టాకీ పార్ట్ పూర్తి చేద్దాం అని బాలయ్య  ప్లాన్ వేస్తుండగా క్రిష్ మాత్రం  ముందుగానే సినిమాని కంప్లీట్ చేసి ఆ తరవాతే పెళ్లి వైపు వెళదాం అని ఆలోచిస్తున్నారట. పర్సనల్ లైఫ్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గురించి బాలయ్య క్రిష్ కి ఇప్పటికే క్లాస్ పీకారు అనీ క్రిష్ ఎంత డైరెక్టర్ అయినా, జ్ఞాని అయినా బాలయ్య చెప్పిన కొన్ని విషయాలు విని నివ్వెర పోయారు అని చెబుతున్నారు. బాలయ్య  క్రిష్ ల మధ్యన క్రిష్ పెళ్లి ప్రస్తావన రోజూ రావడం. సినిమా కంప్లీషన్ పెళ్ళికి ముందరా ? తరవాతా ? అనే చర్చ సాగడం మామూలు అయిపొయింది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: