‘బెంగాల్ టైగర్’ విడుదల తరువాత గత 8 నెలలుగా ఖాళీగా రోజులు గడిపేస్తున్నాడు రవితేజా. 2016 సంవత్సరంలో రవితేజ నటిస్తున్న ఒక్క సినిమా కూడ సెట్స్ పై లేదు అంటే ప్రస్తుతం మాస్ మహారాజ కెరియర్ ఎంత రివర్స్ గేర్ లో ఉందో అర్ధం అవుతుంది.

ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రవితేజా తన న్యూ లుక్ కోసం ‘న్యూలుక్‌ రీజువినేషన్ థెరపీ’ కోసం కొన్నిరోజులపాటు రవితేజ ఫారెన్‌కి వెళ్తున్నట్లు టాక్. అక్కడి రిసార్ట్స్‌లో థెరపీ ట్రీట్‌మెంట్ తీసుకుని స్లిమ్‌ గా మారడానికి రవితేజా విదేశాలు వెళుతున్నట్లు టాక్. 

ఈమధ్య కాలంలో నిర్మాత డీవీవీ దానయ్య రవితేజాతో ఒక సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. దీనితో ఈ సినిమాలో అయినా తమ అభిమాన హీరో నటిస్తాడని మాస్ మహారాజా అభిమానులు భావించారు. ఈ వార్తలు కూడ గాలి వార్తలుగా తేలిపోవడంతో కనీసం తన లుక్ ను మార్చుకునే పని అయినా చేయాలని రవితేజా ఇలా విదేశాల బాట పట్టాడు అనుకోవాలి. 

తనకు రోజురోజుకు క్రేజ్ తగ్గి పోతున్నా ఆ విషయాలు ఏమి పట్టించుకోకుండా రవితేజా తన పారితోషికం విషయంలో పడుతున్న మొండి పట్టుదల వల్లనే రవితేజా కెరియర్ స్లో అవుతోందనే కామెంట్స్ ఇప్పటికే ఉన్నాయి. ఈ హీరోతో ఏ నిర్మాత అయినా మూవీ చేయాలంటే కనీసం 25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు అవుతున్న నేపధ్యంలో ఆ స్థాయిలో రవితేజా సినిమాలకు కలక్షన్స్ లేకపోవడంతో చాలామంది దర్శక నిర్మాతలు రవితేజాను పట్టించుకోవడం మానేశారు అనే వార్తలు ఉన్నాయి. కనీసం ఈ రీజువినేషన్ థెరపీ తర్వాత అయినా మాస్ మహారాజా బిజీ అవుతాడా? లేదా అన్నది చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: