ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ ఒంగోలు గిత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో రామ్ నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరవాత భాస్కర్ తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభిస్తాడట. ‘త్వరలోనే నా డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభిస్తాను. దీనికోసం సుమారు పదేళ్లపాటు కష్టపడ్డాను. ఈ కథను ఎప్పుడో రాసుకున్నాను. ఓ పెద్ద హీరోతో ఈ సినిమా చేస్తాను. ఆ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాకు తీరిక దొరికినప్పుడల్లా ఈ సినిమా కథను రాసుకున్నాను. నా కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. అందుకే, దీన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నాను’ అని చాలా సంతోషంగా చెబుతున్నాడు భాస్కర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: