సూపర్ స్టార్ రజినీకాంత్  అభిమానులనిరీక్షణకు  శుభం కార్డు పడింది. రజినీకాంత్ ఇండియాకు వచ్చేశాడు. ఆయన ఆదివారమే చెన్నైలో అడుగుపెట్టాడు. ఎలాంటి హడావుడి లేకుండా తన కూతురు సౌందర్యతో కలిసి రజినీ అమెరికా నుంచి చెన్నై చేరుకున్నాడు. టీషర్ట్ దాని మీద జాకెట్ వేసుకుని. నెత్తిన టోపీ, గాగుల్స్ పెట్టుకుని, హెడ్ ఫోన్స్ పెట్టుకుని జనాలు గుర్తుపట్టకుండా స్పీడ్ గా నడిచి వెళ్ళిపోతున్న రజినీకాంత్ ను చెన్నై ఎయిర్ పోర్ట్ లో చూసి చాలామంది షాక్ అయ్యారు. 

అయినా కొన్ని మీడియా కెమెరాలు ఏదోవిధంగా ఆయనను వెంటాడి తీసిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. రెండు నెలల క్రితం చెన్నై నుంచి అమెరికా వెళ్ళిన రజినీ తన ఆరోగ్యం పై రకరకాల రూమర్స్ వస్తున్నా ఏమి పట్టించుకోకుండా ఇలా ఒకేసారి మెరుపులా చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించి కలకలం సృష్టించాడు. 

 కోలీవుడ్ మీదయా రాస్తున్న వార్తల ప్రకారం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆగస్టులో రజినీ ‘రోబో-2’ కొత్త షెడ్యూల్ మొదలు పెడతాడు అని టాక్. ‘కబాలి’ కి నెగిటివ్ టాక్ వచ్చినా నిన్నటితో ముగిసిన వీక్ ఎండ్ తో ‘కబాలి’ కి ప్రపంచ వ్యాప్తంగా ౩౦౦ కోట్లు కలక్షన్స్ వచ్చాయి అంటూ ఈసినిమా నిర్మాత థాను స్వయంగా ప్రకటించడం ఎవరికీ అర్ధం కాని పజిల్ గా మారింది. 

ఈవార్తలు ఇలా ఉండగా శంకర్ ఇప్పటి వరకు తమిళ సినిమా రంగంలో ఏ సినిమాకు పెట్టని భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రోబో 2.0' మార్కెట్ పై ‘కబాలి’ పరాజయం ప్రభావం తీవ్రంగా చూపెడుతుంది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ‘కబాలి’ ఫలితం నేపధ్యంలో శంకర్ ‘రోబో-2.0’ కు హైప్‌ క్రియేట్‌ చేసినా దానిని బయ్యర్లు నమ్మరు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో రజినీ తిరిగి వచ్చినా ఆయన నటించిన సినిమాల గందరగోళం మటుకు ఇంకా అనేక ట్విస్టులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: