తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి ఏకంగా కుటుంబ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు దర్శకుడు భాస్కర్. అంతేకాదు, ఆ చిత్రం తరువాత అతడి ఇంటిపేరు కూడా ‘బొమ్మరిల్లు’గానే మార్చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్ తో ‘ఒంగోలు గిత్త’ తెరకెక్కిస్తున్నాడు భాస్కర్. ఈ చిత్రం గురించి ప్రస్తుతం అన్ని ప్రసార సాధనాల్లోనూ వార్తలు బాగానే వస్తున్నాయి. అయితే, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ‘ఈ చిత్రం తరువాత బొమ్మరిల్లు భాస్కర్ ఇంటి పేరు మారిపోతుంది. ‘ఒంగోలు గిత్త’ భాస్కర్ అని అందరూ అంటారని వార్తలు రాస్తున్నారు. ఇదే విషయం భాస్కర్ కి నచ్చడం లేదట. ‘నన్ను బొమ్మరిల్లు భాస్కర్ గానే ఉండనీయండి’ అని కొంతమందితో చెప్పిట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: