తెలుగు సినిమా రంగాన్ని మోనార్క్ లా ఒక దశాబ్ద కాలం శాసించిన ప్రకాష్ రాజ్ హవా రావు రమేష్ కెరియర్ స్పీడ్ అందుకోవడంతో ప్రకాష్ కు అవకాశాలు టాలీవుడ్ లో బాగా తగ్గాయి. దీనికితోడు అతడి ఇగో సమస్యలు వల్ల అనేకసార్లు వివాదాలలో చిక్కుకోవడంతో ప్రకాష్ రాజ్ తో పడలేక టాలీవుడ్ టాప్ దర్శక నిర్మాతలు కూడ ప్రకాష్ రాజ్ వైపు చూడటం బాగా తగ్గించి వేసారు. 

అయితే ప్రకాష్ రాజ్ రావు రమేష్ ల మధ్య ఒక విచిత్రమైన పోటీకి వేదికగా అల్లు శిరీష్ నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మారబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాలో వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ వైవిధ్యమైన పాత్రలు చేయడంతో వీరిద్దరి నటనా ప్రతిభకు ఒక పరీక్షలా ఈసినిమా ఉంటుంది అని అంటున్నారు.

వీరిద్దరి మధ్యా చిచ్చు పెట్టే పాత్రలో అల్లు శిరీష్ నటించడంతో ఒకరికొకరు ఎదురుపడిన సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్లలో నువ్వా నేనా అన్నట్లు నటించారని దర్శకుడు పరశురామ్ ఈ సినిమా పై అంచనాలు బాగా పెంచుతున్నాడు. ‘అ ఆ’ తరువాత టాప్ రేంజ్ కి వెళ్ళిపోయిన రావ్ రమేష్ ప్రకాష్ రాజ్ తో ఎలా సవాల్ విసురుతాడు అన్న ఆత్రుత చాలామందిలో ఉంది. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఈ నెల 31న ‘శ్రీరస్తు శుభమస్తు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాల ఘనంగా చేయడానికి అల్లుఅరవింద్ ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నాడు. మెగా యంగ్ హీరోలతో పాటుగా చిరంజీవి అల్లు శిరీష్ ను ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి వస్తున్న నేపధ్యంలో మరో భారీ మెగా ఈవెంట్ కు కౌంట్ డౌన్ మొదలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: