సంగీత దర్శకుడు తమన్ సమకూర్చే బాణీలు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండకపోయినా ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు చాలమటుకు హిట్ అవుతూ ఉండటంతో టాప్ హీరోల సినిమాలు అన్నింటికీ సంగీతం సమకూర్చే సంగీత దర్శకుడుగా తమన్ మారిపోయాడు. ఆమధ్య ఒకప్రముఖ ఇంగ్లీష్ పత్రిక తెలుగు సంగీత దర్శకులు కాపీ చేసిన పాప్ సాంగ్స్ ట్యూన్ల గురించి ఒకపెద్ద ఆర్టికల్ ప్రచురించింది.

అందులో తమన్ పేరు కూడ టాప్ లో వచ్చింది. సినిమాలకు సంబంధించి స్పీడుగా పనిపూర్తి చేస్తాడని మాంచి బీటున్న పాటలు ఇస్తాడని ఇండస్ట్రీలో మంచి పేరైతే ఉంది కానీ కాపీమాస్టర్ అన్న చెడ్డపేరు కూడ తమన్ ను వెంటాడుతూనే ఉంది. అయితే ఈవిషయానికి సంబధించిన కామెంట్స్ తమన్ ఎదురుగానే మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈమధ్య జరిగిన ‘తిక్క’ ఆడియో వేడుకలో సాయిధరమ్ తేజ్ అనుకోకుండా తమన్ గాలి తీసివేసాడు. తన ప్రసంగంలో తమన్ ప్రస్తావన వచ్చినపుడు తమ పరిచయం గురించి గుర్తు చేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. క్రికెట్ గ్రౌండ్లో అనుకోకుండా తామిద్దరం కలిశామని చెప్పిన సాయిధరమ్ తమ మాటల మధ్యలో తమన్ చేసిన ఒక ట్యూన్ అంతకుముందు వచ్చిన ఒక సినిమాలోంచి యాజిటీజ్ దించేసినట్లుంది అని తమన్ కు చెప్పినట్లు అతడి ఎదురుగానే చెప్పి తమన్ కు షాక్ ఇచ్చాడు. 

అయితే సాయిధరమ్ ఈమాట అనగానే తమన్ గట్టిగా నవ్వేశాడు. కాని వెంటనే సాయి ధరమ్ తేజ్ వెంటనే సద్దుకుని తాను ఆమాట అన్నప్పటికీ తమన్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడని తప్పనిసరి పరిస్థితుల్లో కొందరి డిమాండ్ మేరకు అలా చేయాల్సి వచ్చిందని తమన్ తనకు చెప్పినట్లు సాయిధరమ్ అన్నాడు. అయితే ఈవిషయాలు ఈమెగా యంగ్ హీరో ద్వారా విన్న అతిధులు మాత్రం ఇలాంటి అంతర్గత విషయాల్ని లోలోన దాచుకుంటేనే బెటర్ కాని ఇలా ఓపెన్ గా సాయి ధర మ్ తేజ్ లీక్ చేయడం ఏమిటి అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. ఇదిఇలా ఉండగా  ‘తిక్క’ ఆడియో వేడుకలో నయా లుక్ తో జనానికి పెద్ద షాక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. జుట్టు వెరైటీగా కట్ చేయించి గడ్డానికి కూడా టచప్ ఇచ్చి ట్రెండీగా వెరైటీగా కనిపించిన ఈ మెగా మేనల్లుడి గెటప్ అందర్నీ ఆకర్షించింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: