ఈమధ్య కాలంలో టాలీవుడ్ సినిమా రంగంలో గిఫ్ట్ కల్చర్ బాగా పెరిగి పోయింది. తమకు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన దర్శకులకు హీరోలు అదేవిధంగా నిర్మాతలు చాలా ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం టాలీవుడ్ లో ఒక ట్రెండ్ గా మారింది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా సూపర్ హిట్ అయినప్పుడు దర్శకుడు మారుతికి ఆ సినిమా నిర్మాతలు చాల ఖరీదైన కారును మారుతికి ఇచ్చి అతడికి షాక్ ఇచ్చారు.

శ్రీమంతుడు’ ఘన విజయం సాధించాక మహేష్ బాబు ఖరీదైన ‘ఆడి ఎ6’ కారును కొరటాల శివకు ఇచ్చి అతడిని జోష్ లో ముంచెత్తి వేసాడు. ‘జనతా గ్యారేజ్’ ప్రారంభానికి ముందు జూనియర్ 20 లక్షల ఖరీదైన డైమెండ్ వాచ్ ని కొరటాలకు ఇచ్చి సంచలనం సృష్టించాడు. ఇక నిర్మాత బండ్ల గణేష్ విషయం చెప్పనక్కర లేదు. విలువైన గిఫ్ట్స్ ఇచ్చి ఎవరినైనా పడగొట్టడం బండ్ల గణేష్ కు వెన్నతో పెట్టిన విద్య.

ఈ విషయాలు ఇలా ఉండగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ దర్శకుడు సుకుమార్ కు అత్యంత ఖరీదైన ‘BMW X3’ కారును గిఫ్ట్ గా ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దర్శకుడు సుకుమార్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ బ్యానర్ లో తీసిన జూనియర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఇంత ఖరీదైన కారును ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చాడు అన్న విషయమై చాల మంది ఆశ్చర్య పోతున్నారు.

ఆ శక్తి కలిగిస్తున్న ఈ వార్తల వివరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ రూమర్లు బయటకు వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ తో ఈ నిర్మాత తీసిన సినిమాలకు సంబంధించి సుకుమార్ కు పారితోషిక విషయంలో ఇంకా బాకీ పడి ఉన్న నేపధ్యంలో సుకుమార్ కు ఇవ్వ వలసిన డబ్బును డౌన్ పేమెంట్ గా మార్చి ఇలా కాస్ట్లీ గిఫ్ట్ గా మార్చాడు అన్న గాసిప్పు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో సుకుమార్ కు పెద్ద కారు వచ్చేసింది కాబట్టి అతడు కూడ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: