ప్రస్తుతం మీడియాలో ఎక్కడ  చూసినా హీరోయిన్ అమలా పాల్ డైరెక్టర్ విజయ్ ల విడాకులకు సంబంధించిన వార్తలతోనే మీడియా హోరెత్తి పోతోంది.  అయితే ఈ విడాకుల వ్యవహారం కలిసి రావడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.  ఈ ట్విస్ట్ వెనుక కొన్ని షాకింగ్ నిజాలు ఉన్నాయి.  ఆశర్యకరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే అసలు విషయాలు బయట పడతాయి.
 
అమలా పాల్ తనతో బ్రేకప్ అవుతున్న విషయానికి సంబంధించి ఎప్పుడైతే  ఆమె భర్త దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఎప్పుడైతే ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడో.. అప్పటి నుంచే  ఈ ఇష్యూ పై చర్చలు మరింత విపరీతంగా  పెరిగి పోయాయి. ఇప్పుడు అవి అనుకోకుండా మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్లస్ అవుతున్నాయి. 

తమన్నా భాటియా ‘అభినేత్రి  సినిమాతో మన ముందుకు వస్తోంది అన్న విషయం తెలిసిందే.  ఈ సినిమాను సెప్టెంబర్ 9న జూనియర్ జనతా గ్యారేజ్’ తుఫాన్ ను లెక్క చేయకుండా రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తి ఎవరో  కాదు అమలా పాల్ భర్త  ఏ.ఎల్.విజయ్.

ఒకేసారి తెలుగులో అభినేత్రిగా  తమిళంలో డెవిల్ హిందీలో 2 ఇన్ 1 గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా క్రేజ్ ఇప్పుడు విజయ్ ఇలా కాంట్రోవర్సీలో ఇరుక్కోవడంతో మరింత పెరిగి పోయింది.  అది అమలా పాల్ విడాకుల వ్యవహారంతో ‘అభినేత్రి’ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీగా మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

ఇప్పటికే ‘అభినేత్రి’ సినిమాలోని తమన్నా డ్యాన్స్ సాంగ్ టీజర్ సూపర్ హిట్ అవ్వడంతో దీనికితోడు అమలా పాల్ కాంట్రవర్సీ  ఈ సినిమా క్రేజ్ ను మరింత పెంచేసింది. తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్న ఈ సినిమా ద్వారా 100 కోట్ల కలక్షన్స్ రాబట్టాలని ప్రభుదేవా వేసిన మాస్టర్ ప్లాన్ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

ఈ సినిమా కోసం తమన్నా విపరీతంగా కష్టపడటమే కాకుండా కేవలం 30 లక్షల పారితోషికానికి తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అంటే ఈ సినిమా పై ఎన్ని అంచనాలు తమన్నా పెట్టుకుందో అందరికీ అర్ధం అవుతుంది. ‘బాహుబలి 2’ లో తమన్నా నటిస్తున్నా ఆ సినిమా కంటే ‘అధినేత్రి’ తనకు ఎంతగానో కలిసి వస్తుందని తమన్నా పెట్టుకుంటున్న ఆశలకు తోడు అమలా పాల్ వివాదం కూడ కలిసి రావడం మిల్కీ బ్యూటీకి ప్లస్ పాయింట్ అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: