కత్తి రీమేక్ గా మెగాస్టార్ 150వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి సినిమా విషయంలో ప్రతిది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న చిరు వినాయక్ కు కూడా అడుగడుగునా రిస్టిక్షన్స్ పెడుతున్నాడన్నది తెలిసిన వార్తే. అయితే ఇప్పుడు సినిమా షూట్లో ఆలికి ఘోరమైన అవమానం జరిగిందని అంటున్నారు.  


సునీల్ హీరోగా మారే సరికి తను చేయాల్సిన రోల్స్ అన్ని ఆ తర్వాత ఉన్న కమెడియన్స్ కు వస్తున్నాయి. అయితే సునీల్ చేయాల్సిన చిరు సినిమాలోని రోల్ సునీల్ కాదనే సరికి ఆలికి అవకాశం వచ్చింది. కాని ఆలి విషయం మీద చిరు అసంతృప్తిగా ఉన్నాడట. ఆలి చేసిన సీన్స్ చూసిన చిరు అంత గొప్పగా రాలేదని ముందు అనుకున్న సునీల్ తోనే మరళ ఆ సీన్స్ రీ షూట్ చేసే ఆలోచనలో ఉన్నారట.   


ఇక అదే కనుక నిజమైతే ఆలికి అవమానం జరిగినట్టే. చిన్ననాటి నుండి సినిమాల్లో నటించి మెప్పించిన ఆలికి చిరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కాదు కత్తి కోసం జాగ్రత్త పడుతున్న చిరు అండ్ కో ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారట. మరి ఇలానే చేస్తే దీని ఫలితం సినిమా విడుదల తర్వాత కూడా ఉంటుందని అంటున్నారు. 


వినాయ దర్శకత్వంలో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మెగాస్టార్ స్టామినా తెలియచేసే హిట్ కొట్టడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: