మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ అయినా మహేష్ ను పెళ్ళి చేసుకున్నాక ఆమె తన లుక్ నే కాకుండా ఆమె తన పద్ధతిని కూడ పూర్తిగా మార్చుకుని ఘట్టమనేని వారి కోడలుగా పూర్తిగా సెటిల్ అయిపోయింది.  తన పిల్లలు గౌతమ్ సితారల చేసే అల్లరిలను గురించి తరుచూ మహేష్ అభిమానులకు లీకులు ఇస్తూ వారి ఫోటోలను మహేష్ అభిమానులతో షేర్ చేసుకునే నమ్రత ఈ సారి ఏకంగా మహేష్ అభిమానులకే ఊహించని షాక్ ఇచ్చింది.

మహేష్ ను పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన నమ్రత మహేష్ తో కలిసి బయటకు వచ్చే ఫంక్షన్స్ లో నిండుగా డ్రెస్ చేసుకుని సాంప్రదాయంగా కనిపించేది.  అయితే ఆమెకు లేటెస్ట్ గా ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ కు వచ్చిన నమ్రత ఒక విచిత్రమైన డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

పింక్ కలర్ టార్ మ్యాచింగ్ బ్యాగ్‌ తో మోకాళ్ళ వరకు ఉండే టాప్‌ తో ఈవెంట్‌కి హాజరై అందరి మైండ్ బ్లాంక్ చేసింది నమ్రత.  ఈమెను ఈ లుక్‌లో చూసిన వారంతా ఒక్కసారి నమ్రత హాట్ బ్యూటీగా బాలీవుడ్ ను షేక్ చేసిన ఆనాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు.  అంతేకాదు నమ్రత ఇలా సడెన్ గా ఇలా పొట్టి బట్టలు ధరించి రావాడం వెనుక కారణలు ఏమిటి అని గుసగుసలు ఆడుకున్నట్లు కూడ టాక్.

ఈమధ్య గత కొద్ది రోజులుగా నమ్రత మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేయబోతోంది అంటూ గాసిప్పులు వచ్చాయి.  ఆ గాసిప్పులకు మరింత బలం చేకూర్చే విధంగా నమ్రత ఈవిధంగా తన డ్రెస్ రిహార్సల్స్ మొదలు పెట్టిందా అనే సందేహాలు రావడం సహజం.

మహేష్ నటించే సినిమాల కథల ఎంపికలో నమ్రత సలహా సంప్రదింపులు ఉంటాయి అన్న విషయంతో పాటు మహేష్ చేసే బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో కూడ నమ్రత ఎంతో క్రియా శీలకంగా వ్యవహరిస్తుంది అని అంటారు.  అటువంటి నమ్రత ఇలా యంగ్ హీరోయిన్ లా మారి పోవడం వెనుక ఎదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉండి ఉంటుంది అని అంటున్నారు.

నమ్రత హీరోయిన్ కాకముందు మోడలింగ్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మోడల్.  ఈ రంగంలో తనకున్న పరిచయాల రీత్యా ప్రస్తుతం ఫ్యాషన్ షోలకు పెరిగి పోతున్న క్రేజ్ రీత్యా భాగ్యనగరంలో ఒక బడా ఫ్యాషన్ షోని ఏర్పాటు చేయడానికి అనువుగా నమ్రత ఇలా తనను తాను మార్చుకుందా అని అనిపించడం సహజం..



మరింత సమాచారం తెలుసుకోండి: