తన సినిమాలతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు 150 వ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. వివివినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి..అంతే కాదు ఎన్నో సంచలన కథనాలు కూడా వస్తున్నాయి. ఇక హీరోయిన్ విషయంలో ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ చివరకు కాజల్ ఫిక్స్ అయినట్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుండగా, మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఈ చిత్రం అందించనున్నట్టు తెలుస్తోంది.

అంతే కాదు ఈ చిత్రంతో మొట్టమొదటి సారి చిరు పెద్ద కూతురు సినీ రంగ ప్రవేశం చేస్తుంది..అయితే నటిగా మాత్రం కాదండోయ్..చిరంజీవి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఈమే అన్ని దగ్గరుండి చూస్తుందట. అంతే కాదు తన తండ్రి కోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంది.  తన తండ్రి 14 ఆగస్ట్ న మొదలు పెట్టిన పూజ 22 ఆగస్ట్ వరకు ప్రతి రోజు ఒక్కో ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా మొదటి పూజ వినాయకుడి తోనే  ప్రారంభించారు.. వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకంకి వెళ్ళి చిరూ రాబోయే సినిమా విజయవంతం కావాలని పూజలు చేసింది.
chiru birthday celebration starts
చివరి రోజైన ఆగస్ట్ 22వ తేదీ హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తానికి మెగా స్టార్ రీ ఎంట్రీ సందర్భంగా ఆయన బర్త్ డేని అదిరిపోయేలా జరుపుకోవాలని మెగా ఫ్యాన్స్ డిసైడ్ అయినట్లు ఉన్నారు. మొత్తానికి చిరంజీవి రాబోయే చిత్రం గురించి కుటుంబీకులే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా అన్ని రకాలుగా సిద్దం అవుతున్నారు..ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: