సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన హీరోయిన్ ఇలియానా. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన ఇలియానాకి ఇక్కడ డిమాండ్ ఉన్నప్పటికీ...బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అయితే బాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాకపోయినా...తను మాత్రం తిరిగి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించేది లేదు అన్నట్టుగా గట్టి నిర్ణయాన్నే తీసుకుంది.


దీంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు, నిర్మాతలు ఈ బ్యూటీని కాల్షీట్స్ అడిగేందుకు ఎంత మాత్రం ఆసక్తి చూపటం లేదు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కొన్ని చిత్రాలు మినహాయించి ఇలియానాకి ఏమంత సక్సెస్ లు అనేవి లేవు. బాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉన్న హీరోయిన్స్ కి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి కానీ... ఇలియానా కి మాత్రం ఎంత గ్లామర్ చూపించినా ఆఫర్స్ రావటం లేదు.


దీంతో గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఇలియానా నటించిన రుస్తోమ్ మూవీ థియోటర్స్ ని హిట్ చేసింది. ఈ మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి హిట్ ని చూస్తుంది. ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టింది. అలాగే బాలీవుడ్‌లో వచ్చిన బాక్సాఫీస్ హిట్స్‌ లో 2016కి టాప్ 4 పొజిషన్ లో ఉంది. చాలా గ్యాప్ తరువాత ఇలియానా హిట్ ని అందుకోవటం తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది.


అయితే రుస్తోమ్ మూవీ కోసం ఇలియానా తీసుకున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. బాలీవుడ్ లో ఇలియాన రెమ్యునరేషన్ దాదాపు 6 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. కానీ ఈ మూవీ కోసం తను తీసుకున్నది కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే. 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే తనకి ఈ ఆఫర్ వచ్చిందని ఇలియాన ప్రస్తుతం చెప్పుకుంటుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: