టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో త్వరలోనే ఓ భారీ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఆ సినిమాలో హీరోగా వస్తున్న వ్యక్తి ఓ డెబ్యూ హీరో. మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో ‘జాగ్వర్’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని దాదాపు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో ఈ మూవీ ఆడియో వేడుకని ఘనంగా జరపనున్నారు.


ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లను చిత్ర యూనిట్ ఇప్పటికే రెడీ చేస్తుంది. నోవాటెల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు నిఖిల్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన రేంజ్ కి తగ్గట్టుగా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే తెలుగు మూవీల ఆడియో ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఆ మూవీ కచ్ఛితంగా సక్సెస్ ని సాధిస్తుదనేది ఇండస్ట్రీ నమ్మకం.


ఒక మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ ని చూసిన తరవాత పవన్ కళ్యాణ్ ఆ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ వెళ్ళాలా?లేదా? అనేది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎటువంటి మార్కెట్ లేని కొత్త హీరో మూవీ ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ వెళ్ళటం అనేది అస్సలు జరగని పని. కాని ప్రస్తుతం ఇది సాధ్యం అయిందని అంటున్నారు. తన తనయుడు నిఖిల్ సినిమా ఆడియో లాంచ్‌కు రావాల్సిందింగా కుమారస్వామి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కోరారు.


దీంతో పవన్‌ కళ్యాణ్ సైతం కాదనకుండా వస్తాను అనే హామిని ఇచ్చారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ తరహా డెబ్యూహీరోలకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ కి వెళతారా? అనే డౌట్ ఇప్పుడు అందరిలో వస్తుంది. డెబ్యూ హీరో నటించిన ‘జాగ్వర్’ సినిమా మార్కెట్ లో కచ్ఛితంగా యావరేజ్ లేదా నార్మల్ గా ప్రదర్శన జరుపుకుంటుంది.


ఇప్పుడు ‘జాగ్వర్’ మూవీ ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ…ఇది తెలుగులో హిట్ అయ్యే ఛాన్స్ లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆడియో ఫంక్షన్ ని పవన్ కళ్యాణ్ హాజరు అయి…తన ట్రేడ్ మార్క్ ని పొగొట్టుకుంటారో…లేదా పొలిటికల్ మైలైజ్ కోసం ఫంక్షన్ కి అటెండ్ అవుతారో అనేది కొద్దిరోజుల్లో తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: