సినిమా ఇండస్ట్రీ అంటే ఈ మద్య వ్యాపారంగా మారిపోయిందనే చెప్పొచ్చు..సినిమా పాస్ అయినా..ఫెయిల్ అయినా ఆ సినిమా నిర్మాత, డిస్ట్రీబ్యూటర్లపై చాలా ఎఫెక్ట్ పడుతుంది. రీసెంట్ గా పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లతో నిర్మించిన చిత్రాలు భారీ అంచనాల మద్య రిలీజ్ కావడం తీరా థియేటర్లో కి వచ్చాక తుస్ మనడం జరిగింది. దీని వల్ల హీరోకి కాస్త ఇమేజ్ డ్యామేజ్ కావొచ్చేమో కానీ నిర్మాతకు, డిస్ట్రీబ్యూటర్లకు మాత్రం భారీ నష్టాలు చవి చూస్తున్నారు. ఆ మద్య తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘లింగ’ చిత్రం భారీ డిజాస్టర్  అయ్యింది. దీంతో ఆ సినిమా నమ్ముకొని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు రోడ్డున పడ్డారు. దీంతో తమకు నష్ట పరిహారం ఇవ్వాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారు. మొత్తానికి రజినీ స్వయంగా ఎంటర్ కావడం గొడవ కాస్త సర్ధుమనగడం అయ్యింది.
Image result for Director Hari
రీసెంట్ గా పవన్ కళ్యాన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ముంబాయిలో మాఫియా సామ్రాజ్యమేలుతుంది. రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో కూడా నయీమ్ తన నేర సామ్రాజ్యాన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంటర్ చేశారని ఇప్పుడిప్పుడే నిజాలు బయట పడుతున్నాయి. తాజాగా  తమిళ డైరెక్టర్ హరి ని చంపేస్తామని బెదిరించడమే కాకుండా ఏకంగా రెండుసార్లు అతడి ఇంటిపై బాంబులు వేసి భయబ్రాంతులకు గురి చేసారు . ఈ సంఘటన నిన్న చెన్నై లో జరిగింది. ఇదంతా సినిమా స్టైల్లో జరిగింది..చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని తనపై దాడి చేసినట్లు హరి చెబుతున్నారు.
Image result for Director Hari
కారు  పార్కింగ్ విషయంలో హరి ఇంటి పక్కనున్న వాళ్లతో గొడవ జరగడంతో పక్కింటి కార్తీక్ ,కరుప్ప స్వామి అనే ఇద్దరూ దర్శకులు హరితో గొడవ పడటమే కాకుండా చంపేస్తామని బెదిరించారట అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక పోవడంతో తో రెండు బాంబులు హరి ఇంటి పై వేసారు దాంతో భయ బ్రాంతులకు గురైన హరి విరుంబాక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తమిళంలో మాస్ చిత్రాలకు పెట్టింది పేరు అయిన హరి ప్రస్తుతం సింగం సిరీస్ లో సింగం 3 చిత్రం సూర్య తో చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: