కర్ణాటకలో పవన్ వీరాభిమాని వినోద్ హత్య చేయబడిన తరువాత పవన్ జూనియర్ అభిమానుల మధ్య బయట పడని  సైలెంట్ వార్ నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది.  అయితే పవన్ స్వయంగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టీ హీరోల మధ్య లేని వైషమ్యాలు అభిమానులకు ఎందుకు అని పవన్ తో సహా ఎందరో ప్రముఖులు సందేశాలు ఇస్తున్న నేపధ్యంలో పవన్ అభిమానుల కోపం తాత్కాలికంగా ఉపసమనాన్ని పొందింది.

అయితే ఇప్పుడు పవన్ అభిమానుల దృష్టి ‘ప్లాంట్ ఫర్ పవన్’ పిలుపు పై పడింది.  సెప్టెంబర్ 2న రాబోతున్న పవన్ కళ్యాణ్ పుట్టినారోజునాడు ‘ప్లాంట్ ఫర్ పవన్’ అనే స్లోగన్ తో మన ఇరు రాష్ట్రాలలోను కొన్ని లక్షల మొక్కలు నాటి పర్యావరణకు సహాయ పడే కార్యక్రమంగా ఈ ప్రాజెక్ట్ ను మార్చబోతున్నారు.  అయితే ఇక్కడ కూడ బయటకు చెప్పకపోయినా అంతర్లీనంగా జూనియర్ అభిమానులతో పవన్ అభిమానులు పోటీ పడుతున్నారా అని అనిపించడం సహజం.

వచ్చే వారం విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ మూవీలో జూనియర్ చెట్లను ప్రేమించే ప్రేమికుడుగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపధ్యంలో జూనియర్ పాత్రలో అంతర్లీనంగా ఉండే సందేశాన్ని ఇంకా ఈ సినిమా విడుదల కాకుండానే అనేకమంది జూనియర్ అభిమానులు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే పిలుపును తమలో తామే సోషల్ మీడియా వేదికగా ఇచ్చుకుని అనేక మొక్కలను ‘జనతా గ్యారేజ్’ స్పూర్తితో నాటి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ సామాజిక స్పృహను చాటుకుంటున్నారు.

ఇప్పుడు పవన్ అభిమానులు రంగంలోకి దిగి ఇదే సోషల్ మీడియా వేదికగా ‘ప్లాంట్ ఫర్ పవన్’ అంటూ ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు.  ఈ తరహా కార్యక్రమం గత సంవత్సరం పవన్ పుట్టినరోజునాడు కూడ చేసినా ఈసారి ‘జనతా గ్యారేజ్’ విడుదల సందర్భంగా జూనియర్ అభిమానులు ఇప్పటికే ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేసిన నేపధ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ జూనియర్ ల అభిమానుల మధ్య పోటీ జరగబోతోందా అని అనిపించడం సహజం.

మంచి ఆశయాల కోసం టాప్ హీరోల అభిమానులు పోటీ పడుతున్న ఈ నేపధ్యం అందరూ హర్షింప తగ్గ పరిణామం.  ఇది ఇలా ఉండగా ఎప్పుడూ ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకునే అలవాటు లేని పవన్ నిన్న తన వీరాభిమాని వినోద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తరువాత నిన్న సాయంత్రం తిరుమలకు వెళ్ళి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

పవన్ లో కొత్తగా కనిపించిన ఈ ఆధ్యాత్మిక భావనను చూసిన వారు మాత్రం పవన్ తన అభిమాని వినోద్ కుటుంబానికి మంచి జరగాలని కోరుకున్నాడా ? లేదంటే పవన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాడా ? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: