స్టార్ హీరోయిన్ గా ఉన్నా కొద్దిపాటి ఛాన్సులు మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ రాగానే టాప్ హీరోయిన్స్ అయినా సరే ఐటం సాంగ్స్ వేస్తుండటం చూస్తుంటాం. అయితే కెరియర్ లో ఆ అనుభవం మొదటిసారి ఫేస్ చేస్తున్న కాజల్ మాత్రం తను చేసింది ఐటం సాంగ్ అంటే మాత్రం కస్సు బుస్సు లాడుతుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అంటూ స్పెషల్ సాంగ్ లో నర్తించింది కాజల్. మరి అనడానికి స్పెషల్ సాంగ్ అంటున్నా అది ఐటం సాంగ్ అనే భావన ఉంది.


అయితే ఈ విషయాన్నే కాజల్ దగ్గర ప్రస్తావిస్తే ఐటం సాంగ్ కాదు అది కమర్షియల్ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ అంటూ కటింగులిస్తుంది. ఇక కెరియర్ దాదాపు ముగిసిపోయింది అనుకుంటున్న టైంలో సడెన్ గా స్టార్స్ తో ఛాన్సులు రావడం పట్ల సంతోషంగా ఉన్న కాజల్ తానింకా ఇదే ఫాంను కొనసాగించడం ఖాయమని బల్ల గుద్ది మరి చెబుతుంది. ఎలాగు చేతిలో అరడజను సినిమాలా దాకా ఉన్నాయి వాటిలో ఒకటి రెండు బ్లాక్ బస్టర్ అయినా సరే మళ్లీ కాజల్ బిజీ హీరోయిన్ అయినట్టే. 


మరి ఇన్ని తెలిసిన అమ్మడు ఐటం సాంగ్ అదే ఆమె అనుకుంటున్న స్పెషల్ సాంగ్ ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. క్రేజ్ తగ్గుతున్న సందర్భంలో స్టార్ హీరో సినిమాలో ఏ చిన్న అవకాశాన్ని వదలని భామలు ఇలా కటింగులివ్వడం మాములే. ఇక జనతా గ్యారేజ్ లో కాజల్ సాంగ్ గురించి చెప్పుకుంటే కెరియర్ లో మొదటిసారి ఐటం సాంగ్ చేస్తున్న కాజల్ తనను మరి అసభ్యకరంగా చూపించవద్దని ముందే దర్శక నిర్మాతలకు చెప్పిందట. మరి ఇంత కష్టపడి కాజల్ ఈ సాంగ్ ఎందుకు చేస్తుందో.


ఇక సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న జనతా గ్యారేజ్ లో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం జరిగింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లా ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాను మలయాళంలో కూడా భారీ రేంజ్లో రిలీజ్ చేస్తుండటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: