మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెంబర్ 150 రెగ్యులర్ షూట్ జరుపుకుంటుంది. ఇప్పటికే సగానికి పైగా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఈ మధ్యనే హీరోయిన్ కాజల్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సినిమాకు మరింత కలరింగ్ అద్దడానికి ఓ స్పెషల్ ఐటం ప్లాన్ చేస్తున్నారట అది కూడా ఓ క్రేజీ బ్యూటీతో ఉంటుందట.


మెగాస్టార్ సినిమా అది మెగా ఐటం సాంగ్ మరి ఆ అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా చెప్పండి. స్టార్ హీరోయిన్లైనా సరే ఈ క్రేజీ ఆఫర్ కు ఫిదా అవ్వాల్సిందే. అయితే ఓ పక్క హీరోయిన్ గా క్రేజ్ సంపాదించినా మరో పక్క ఎవరేమనుకున్నా ఐటం సాంగ్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది మిల్కీ బ్యూటీ తమన్నా.


ఇక ఆ తర్వాత అదే క్రేజ్ తో ఐటం చేసే సత్తా ఉంది అని శృతి హాసన్ కూడా ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మెగాస్టార్ తో ఐటం సాంగ్ పోటీ జరుగుతుందట. చార్మింగ్ లుక్స్ తో చిరుతో ఐటం కు సై అంటుంటే మెగా ఐటం నేనే అంటూ వయ్యరాలు పోతుంది తమన్నా. మరి ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో గాని ఇప్పటికే దేవి మెగాస్టార్ ఐటం కోసం ఓ అదిరిపోయే ట్యూన్ ఇచ్చేశాడట.


మెగాస్టార్ తో స్టెప్పులేసే సత్తా ఉండి మరో పక్క హాట్ అందాలతో పిచ్చెక్కేలా చేసే భామనే ఈ ఐటం సాంగ్ కు ఓకే చేస్తారట. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. మెగాస్టార్ ఖైది నెంబర్ 150 ఫస్ట్ లుక్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ కు వినాయక్ భాద్యత మరింత పెరిగింది. సినిమా మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కిస్తున్నాడట.


రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరగొట్టే మ్యూజిక్ ఇస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అనుకున్నట్టుగా పూర్తి చేయగలిగితే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుర శాతకర్ణి రిలీజ్ డేట్ ఇచ్చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: