ఒక్క హైదరాబాద్ లోనే గణేషు విగ్రహాలతో  సుమారు 60 వేల వరకు గణపతి మండపాలు పెట్టడం జారుతూ ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఊరులో  నేడు పెడుతున్న గణేష  మండపాల సంఖ్య కొన్ని లక్షలలో ఉంటుంది.  దాదాపు కొన్ని వందల కొట్లలో గణపతి విగ్రహాల బిజినెస్ దేశ వ్యాప్తంగా జరుగుతుంది అంటే గణపతి మన జీవితాలలో ఎంత అంతర్భాగమో అర్ధం అవుతుంది.  

చవితి పండుగ వచ్చింది అంటే ప్రతి ఇల్లూ అలాగే ప్రతి వీధిలోని యువకులు  ఇలా ప్రతి ఒక్కరూ స్వీట్స్,  డెకరేషన్స్, వినాయక విగ్రహం తెచ్చుకోవడంలో ఆర్భాటంగా  హడావిడి చేస్తూ ప్రతి ఒక్కరూ బిజీగా కనిపిస్తారు.  అయితే ఖచ్చితంగా మట్టి గణపతి విగ్రహాలలనే మండపాలలో పెట్టమని ఎందరో ఎంతో ప్రచారం చేస్తూ ఉన్నా ఇంకా కలర్ ఫుల్ గా మెరిసిపోయే పెయింటింగ్ తో ఉండే వినాయక విగ్రహాలు మాత్రమే మనకు చాలా చోట్ల  కనిపిస్తాయి. 

ఎంతో ఆకర్షనీయంగా కనిపించే ఈ అందమైన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికే కాదు మన శరీర ఆరోగ్యానికి కుడా ఎంత నష్టం జరుగుతుందో అందరికీ పరిపూర్ణంగా తెలిస్తే ఎవరు కనీసం వచ్చే ఏడాది నుంచి అయినా ఇటువంటి  వినాయక విగ్రహాలు పెట్టరు.  ఈ అందమైన రంగురంగుల గణపతులకు బదులుగా ఈ మట్టి గణపతులను ఎందుకు పెట్టుకోవాలో తెలిస్తే  అందరూ ఖచ్చితంగా మట్టి గణపతినే తీసుకొస్తారు. 

మట్టి విగ్రహాలు మనుషుల జీవితంపై ఎలాంటి దుష్ర్పభావం చూపించవు. ఇవి కాస్త డల్ గా కనిపించినా ఎట్రాక్ట్ చేయకపోయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్థాయి.  వినాయకుడి విగ్రహం అలంకరణ కోసం ఉపయోగించే కలర్స్  లో ఎక్కువ మొత్తంలో మెర్క్యురీ లెడ్ ఉంటుంది. ఇవి నరాల వ్యవస్థపై, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీల పై చాలా దుష్ర్పభావం చూపిస్తాయి.  

అంతేకాదు వినాయకుడి విగ్రహాలను అందంగా అలంకరించడానికి ఉపయోగించే డైలు చాలా హానికరమైనవి  ఇందులో హానికారక మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థ  పై చాలా దుష్ర్పభావం చూపిస్తాయి. డైస్, కలర్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్  వంటివి వినాయక  విగ్రహం తయారి కోసం ఉపయోగిస్తారు. ఇవి మన ఆరోగ్యంపై చాలా దుష్ర్పభావం చూపెట్టి మనకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి. ఈ ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితం కావడమే  ఆ విగ్రహాలు నిమజ్జనం తరువాత నీటి నుండి  వచ్చే వాయువులు  ఊపిరితిత్తులపై దుష్ర్పభావం చూపుతాయి.  అంతే కాదు ఆ విగ్రహాలకు సంబంధించిన గ్లిట్టర్స్ చేతులకు అంటడం వల్ల అవి లంగ్స్ ను తీవ్రంగా  డ్యామేజ్ చేస్తాయి. 

కలర్ ఫుల్ వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలని ప్రయత్నిస్తున్నపుడు చర్మం పై అలర్జీలు, ర్యాషెస్ కి కారణమవుతాయి.  అంతేకాదు కలర్ గణేష్ వల్ల శరీరంలోని ముఖ్య  భాగమైన కళ్లకు హానికలుగుతుంది.  ఈ విగ్రహాలను తదేకం చూస్తే కళ్ళు మండినట్లు అని పించడమే కాకుండా కళ్లలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎన్నో అనారోగ్యాలకు హేతువు అయిన ఈ కలర్ గణేష్ లను లక్షల సంఖ్యలో మన జనా వాసాల మధ్య ప్రతిష్టించి ఆ తరువాత  నిమజ్జనం చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎందరో చెపుతున్న కలర్ వినాయకుడు  లపై మన మోజు తగ్గడం లేదు. కనీసం వచ్చే ఏడాదికి అయినా మన అందరకీ ఈ చదువుల గణపతి మనకు ఈ విషయం  పై ఆలోచనలను కలిగించాలని కోరుకుందాం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: