తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఝుమ్మందినాధం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ తాప్సీ తర్వాత అగ్ర హీరోల సరసన నటించినా పెద్దగా పేరు రాలేదు. అందమైన చిరునవ్వుతో ఇట్టే ఆకర్షించే తాప్సి గ్లామర పరంగా ఎన్ని సినిమాల్లో నటించినా పెద్ద విజయవంతం కాలేదు. ఆ మద్య లారెస్స్ సరసన నటించిన గంగ చిత్రంలో ఈ అమ్మడికి మంచి మార్కులే పడ్డా నటన పరంగా మాత్రం నిత్యామినన్ కే ఎక్కువ పేరు వచ్చింది. ప్రస్తుతానికి ఈ భామకు పెద్దగా సినిమాలు ఏవీ లేవు..తాజాగా తాప్సీని ఓ ఆకతాయి విపరీతంగా వేదించడం మొదలు పెట్టాడ. ఒక రకంగా చెప్పాలంటే సైకో లా ప్రవర్తిస్తున్నాడని వాపోయింది.
Taapsee Pannu
తన షూటింగ్స్ ఎక్కడ ఉన్న అక్కడ ప్రత్యక్షం కావడం తనతో మాట్లాడటానికి ప్రయత్నించడం అడ్డుగా వచ్చిన సెక్యూరిటీని కూడా పక్కకు తోసి తనని కలవాలని ప్రయత్నం చూస్తుంటే తాప్సి బెంబేలెత్తిపోయిందట. అయితే తాను పలనా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఆ ఆకతాయికి ఎలా తెలుస్తుందో అస్సలు అర్ధం కావడం లేదట. గతంలో కొంత మంది సెలబ్రెటీలను ఇలాగే వేదించి పోలీస్ స్టేషన్ పాలైన అభిమానులకు చాలా మంది ఉన్నారు.
Image result for taapsee pannu
ఆ మద్య తిరుపతిలో కేవలం హీరోల మీద అభిమానంతోనే స్నేహితుల మద్య గొడవ వచ్చి చంపేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఇక తాప్సి విషయానికి వస్తే ఆ ఆకతాయి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి హానీ చేయలదని అందుకే పోలీస్ కేసు పెట్టలేదని అంటుంది తాప్సి. ఏది ఏమైని కొంత మంది అభిమానం మరీ ఎక్కువ అయితే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని సెలబ్రెటీలు గమనించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: