‘సుడిగాడు’ హిట్ తరువాత అల్లరి నరేష్ కు ఒక్క సినిమా కూడ సరైన హిట్ ఇవ్వకపోయినా ‘సుడిగాడు’ సినిమాలో స్పూఫ్ లు తనకు కలిసి రావడంతో అదే తరహాలో సెటైర్లు కొనసాగిస్తున్నాడు అల్లరి నరేష్.  అయితే ఈ సెటైర్ల సంస్కృతి జనానికి బోర్ కొట్టి అల్లరి నరేష్ సినిమాలు అన్నీ ఘోర పరజయలుగా మారుతున్నా అల్లరోడు మార్పు లేదు.

ఈ పరిస్తుతులు ఇలా ఉండగా నరేష్ ఈసారి తన పద్ధతి మార్చుకుని త్వరలో దెయ్యంతో ఒక ఆటాడుకుంటూ ప్రేక్షకులను నవ్వించడానికి 
నరేష్ తన కొత్త సినిమా  ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అంటూ వెరైటీగా రాబోతున్నాడు. అంతేకాదు ఈసారి చాలామంది యంగ్ హీరోలతో పోటీ పడుతూ దసరాకు రావడమే కాకుండా దసరా రేసులో విజయం సాధించడానికి చాల గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. 

ఇది ఇలా ఉండగా ఈ సినిమా విషయంలో కూడ కొన్ని స్పూఫ్ లు ఉన్నట్లు టాక్.  లేటెస్ట్ గా విడుదలై 100 కోట్ల సినిమాగా మారిన ‘జనతా గ్యారేజ్’ పై ఇందులో సెటర్లు వేసినట్లు టాక్.  

ఈ సినిమాలో ‘జనతా గ్యారేజ్’ కాస్త ‘సమంత గ్యారేజ్’ అయిపోయిందట. మోహన్ లాల్ కాస్త భజన్ లాల్ గా అయిపోయాడు అని టాక్. భజన్ లాల్ గా అలీ ఈ సినిమాలో  చేసే హాస్యం చూసి ప్రేక్షకులు తెగ నవ్వుకుంటారని ఫిలింనగర్ టాక్.

అలీ ఈ సినిమాలో అలీ భజన్ లాల్ గెటప్ ఎలా ఉంటాడో మచ్చుకు చూపిస్తూ ఒక సెల్ఫీ తీసుకుని తన ఫేస్ బుక్ లో  పెట్టాడు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తనకు గ్యారెంటీ హిట్ గా మారుతుందని నమ్మకం పై ఉన్నాడు అల్లరి నరేష్.

ఈమధ్య కాలంలో దెయ్యం సినిమాలు బాగా హిట్ అవుతున్న నేపధ్యంలో ఈ సారి తనకు ఈ దెయ్యం సెంటిమెంట్ బాగా కలిసి వస్తుంది అన్న నమ్మకంతో అల్లరి నరేష్ ఈ సాహసం చెస్థున్నాడు. అయితే ఈసారి దసరా రేసుకు పోటీ పడుతున్న నాగచైతన్య రామ్ సునీల్ నిఖిల్ దేవగౌడ సినిమాలతో పోటీగా వస్తున్న ఈ అల్లరోడు దెయ్యంతో చేసే సాహసాలు ప్రేక్షకులు ఎంత వరకు హర్షిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: