ఈరోజు విడుదల అవుతున్న ‘సిద్దార్ద’ సినిమాకి పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్న వార్తలు చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.  పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్ లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న దయానంద రెడ్డి ఈరోజు విడుదల అవుతున్న ‘సిద్ధార్ధ’ సినిమాకు దర్శకుడు అవ్వడంతో ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

బుల్లితెర పై ప్రసారం అయిన మెగా సీరియల్ ‘మొగలి రేకులు’ లో హీరోగా నటించి బుల్లితెర మెగా స్టార్ గా పేరు సంపాదించిన సాగర్ హీరోగా నిర్మించిన ‘సిద్దార్ద’ సినిమాను దయానంద రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇతడు పవన్ కళ్యాణ్ దగ్గర దాదాపు పుష్కర కాలం పని చేసి పవన్ ఆశీస్సులతో  గతంలో ‘అలియాస్ జానకి’ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

1995 లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ దర్శకుడు ‘బద్రి’ సినిమా టైమ్ లో పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడటంతో ఆ తరువాత పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్ లో చేరిపోయి 12 సంవత్సరాల పాటు పవన్ దగ్గర శిష్యరికం చేసాను అని అంటున్నాడు.  పవన్ సన్నిహితురాలు నీలిమ తిరుమల శెట్టి నిర్మించిన ‘అలియాస్ జానకి’ సినిమాతో దర్శకుడుగా మారిన దయానంద రెడ్డి తనలోని దర్శకుడుని బయటకు తీసుకు వచ్చి మెగా ఫోన్ పట్టేలా చేసింది పవన్ కళ్యాణ్ అని అంటున్నాడు.

తాను పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఊహించని ఒక డిఫరెంట్ కథ వ్రాసానని ఆ కథకు దరకత్వం వహించే బాధ్యతలు తనకు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను పవన్ కోసం వ్రాసిన ఆ కథను మరే హీరోకి ఇవ్వనని రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ పవన్ కు బాగా నచ్చుతుంది అని కామెంట్స్ చేసాడు దయానంద రెడ్డి.  

ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదల అవుతున్న ‘సిద్దార్ద’ సినిమాకు టాప్ టెక్నిషియన్స్ ఎస్. గోపాల్ రెడ్డి మణి శర్మ లాంటి వ్యక్తులతో పాటు పరుచూరి బ్రదర్స్ ఈసినిమాకు స్క్రిప్ట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతేకాదు ఈ సినిమా ఏకంగా నాగార్జున ప్రత్యెక పాత్రలో నటిస్తున్న ‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో పోటీగా విడుదల చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మాస్ హీరో ఇమేజ్ ఉన్న పాత్రకు సాగర్ ను హీరోగా చేసి  చేస్తున్న ఈ ప్రయోగంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ యాక్షన్ వినోదం మేళవింపుగా దయానంద్ రెడ్డి తీసిన ఈ సినిమా ప్రయోగం సక్సస్ అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఇతడికి రానున్న రోజులలో పిలుపు వచ్చినా ఆశ్చర్యం లేదు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: