ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఇయర్ మొదట్లో హిట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు.  కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు కథ కథనాల మీద అంత దృష్టి పెట్టకుండా సినిమాలు చేసిన రామ్ ఇప్పుడు అన్నిటి మీద తనకు ఆమోదం అనిపిస్తేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే రామ్ రాబోతున్న సినిమాలను గమనిస్తే మళ్లీ మనోడు ఫ్లాప్ డైరక్టర్స్ కు ఛాన్సులిస్తూ రిస్క్ తీసుకుంటున్నాడు. నేను శైలజ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో హైపర్ సినిమా చేసిన రామ్ మళ్లీ ఇప్పుడు కరుణాకరణ్ డైరక్షన్లో సినిమాకు ఓకే చెప్పాడట.

 

క్రేజీ ఫీలింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా రామ్ ఒప్పుకోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నారు. ఇప్పుడే కాస్త రూటు మార్చినట్టు కనిపించిన రామ్మళ్ళీ ఇలా ఫ్లాప్ డైరక్టర్స్ కు ఎందుకు అవకాశాలిస్తున్నాడు అన్నది ఎవరికీ అర్ధం కావట్లేదు. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు ఒకసారి ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ కు మరో ఛాన్స్ ఇస్తే ఈసారి తప్పకుండా హిట్ ఇస్తాడని రామ్ నమ్ముతున్నాడు.

 

రభస ఫ్లాప్ తర్వాత రాంతో హైపర్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్ కూడా సినిమాను చాలా పర్ఫెక్ట్ గా తీశాడని అంటున్నారు. 14 రీల్స్ బ్యానర్లో రాం ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది.

 

లాస్ట్ ఇయర్ మూస కథలతో రామ్ సినిమాలు చేస్తున్నాడనే టాక్ తన దాకా వచ్చిందన్న రామ్.. మరి ఈ ఫ్లాప్ డైరక్టర్స్ తో సినిమాలు చేసే కారణం కూడా తనకు తెలిసే ఉంటుంది. అయినా ఏ డైరక్టర్ తో చేస్తే ఏంటి తనకు కావాల్సింది ఓ హిట్ కాబట్టి తనని ఇంప్రెస్ చేసే కథ ఎవరు చెప్పినా రామ్ సినిమా తీసేందుకు సిద్ధమే. మరి రామ్ చేస్తున్న ఈ సాహసం అతనికి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: