గత ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చి టాలీవుడ్ లో మోడరేట్ హిట్ గా పేరు తెచ్చుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ బాలీవుడ్ లో సాధిస్తున్న విజయాలకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ న్యూస్ గా మారాయి.  టాలీవుడ్ లో ఫెయిల్ అయిన చాల సినిమాలు యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించడం సర్వసాధారణ విషయం.

అయితే హిందీలో సోనీ మ్యాక్స్ లాంటి ఛానెళ్లు ప్రతిరోజు ప్రసారం చేసే సినిమాలలో ఎక్కువగా హిందీ భాషలోకి డబ్ అయిన తెలుగు సినిమాలే ఉంటాయి.అటువంటి పరిస్థుతులలో ఈమధ్య సోనీ మాక్స్ ఛానల్ లో ప్రసారం అయిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు మంచి రేటింగ్స్ రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ పేరుతోనే ఈ చిత్రాన్ని హిందీలోకి అనువదించి యూట్యూబ్ లో పెట్టగా ఈసినిమాకు దాదాపు 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటిదాకా ఈసినిమాకు హిట్స్ 69 లక్షలున్నాయి అని అంటున్నారు. త్వరలోనే కోటి వ్యూస్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు అనే  వార్తలు కూడ ఉన్నాయి.

మరోవైపు ఈమధ్య హిందీ ఛానల్ లో ప్రసారం అయిన ఈసినిమాకు గత వారానికి సంబంధించి హిందీ ఛానెళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అగ్రస్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ప్రతివారం టీవీ రేటింగుల్ని వెల్లడించే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా ఈ విషయాన్ని తెలియచేసింది అన్న వార్తలు వస్తున్నాయి.

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రేటింగ్స్ విషయంలో  లిస్టులో టాప్-3లో ఉన్న సినిమాలు తెలుగు నుండి హిందీ భాషలోకి డబ్ అయిన సినిమాలే కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఈ రేటింగ్స్ లో రెండో స్థానంలో ‘బాహుబలి’ నిలిస్తే మూడో స్థానం ‘ఇష్క్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘భాయిగిరి’ నిలిచింది. 

‘దిల్ వాలే’ ‘షోలే’ తర్వాత స్థానాలు రేటింగ్స్ విషయంలో హిందీ లోకి డబ్ అయిన తెలుగు సినిమాలు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  ఈ విషయాలన్నీ తన దృష్టికి రావడంతో కాబోలు అల్లుఅర్జున్ ఈసారి ఏకంగా తన మార్కెట్ ను కోలీవుడ్ లో పెంచుకోవడానికి ఇప్పటికే తన ఎత్తుగడలు ప్రారంభించాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: