Image result for beautiful anushka shetty latest images

‘బాహుబలి-2’, ’సింగం-3’, ’ఓమ్‌ నమో వెంకటేశాయ’, ’భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమా ల్లో తెలుగు చిత్రసీమ లో క్షణం తీరిక లేకుండా నటిస్తున్న భారీ చిత్రాల కథానాయకి మన స్వీటీ అనుష్క వివాహం చుట్టూ ఇప్పుడు వెబ్‌ మీడియాలో చాలా రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

 

తను ప్రస్తుతం నటిస్తున్న భారీ సినిమాలవల్ల ఒకరోజులో 24 గంటల సమయము సరిపోవటం లేదని ఈ పరిస్థుతుల్లో తాను తన వివాహం గురించి అలోచించటమే లేదని ఎవరితోనో ప్రేమాయణం నడిపే సమయమే తనకు కలలో కూడా లభించటం తనకు లేదని తనపై వస్తున్న పుకార్లపై తన సన్నిహితులవద్ద అసంతృప్తి, ఆవేదనను వ్యక్తం చెందుతున్నట్లు తెలిసింది.

 Image result for beautiful anushka shetty latest images

“అనుష్క టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తాజాగా వందతులు వస్తున్నాయి. ఆ నిర్మాతను త్వరలోనే అనుష్క పెళ్లి కూడా చేసుకోబోతున్నదంటూ టాలీవుడ్‌లో రూమర్లు   షికారు చేస్తున్నాయి”

 

అనుష్క పెళ్లి విషయంలో రూమర్లు రావడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఓ యంగ్‌ హీరోను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వదంతులు ప్రచారం అయ్యాయి. అప్పుడు దీంతో అనుష్కనే స్వయంగా వివరణ ఇచ్చింది. తాను రహస్యంగా పెళ్లి చేసుకోబోనని, తన పెళ్లి గురించి అందరికీ చెప్పి చేసుకుంటానని ఆ మధ్య చెప్పింది.

 Image result for beautiful anushka shetty latest images

తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న రూమర్లు అనుష్కను బాధించాయట. ఈ కథనాలపై ఆమె తన సన్నిహితుల వద్ద అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయినా ఈ  35 ఏళ్ల జేజమ్మ ఇలాంటి రుమర్లు పట్టించుకోకుండా ఫుల్‌ జోష్‌ లో పూర్తి ఏకాగ్రతతో తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందని సన్నిహితులు చెప్తున్నారు.

 

ఆమె పై వచ్చే రూమర్స్ పై ఈ మధ్య స్పందిస్తూ, సినిమా పరిశ్రమ లాంటి గ్లామర్ ప్రపంచంలో అదీ తన లాంటి కథానాయికల పై ప్రతి క్షణం వదంతులు వస్తూనే ఉంటాయని, అవి అనేక సందర్బాలలో వాటి నిజానిజాలెలా ఉన్నా ప్రభావం మాత్రం తమ వ్యక్తిగత జీవితాలపై ధారుణంగా ఉంటుందన్నారు.

 Image result for beautiful anushka shetty latest images

మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు రాసేవాళ్ళు వారి వారి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటారు. కొంత బాధపడ్డా, వాటిని తలచుకొంటూ ఏడుస్తూ కూర్చోలేమని అన్నారు. అయితే ఆ బాధను మనసులో ఎల్ల కాలమూ పెట్టుకొంటే నిద్రకూడాపట్టదని అన్నారు. తానింత ప్రశాంతంగా ఎలా ఉంటున్నదో వివరిస్తూ తనమనసు గిల్టీ గా లేనప్పుడే అది సాధ్యమవుతుందని ఆమె అన్నారు. తాను ప్రస్తుతం అనేక అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తున్నందున పెళ్ళిపై ఏలాంటి ఆలోచనలు, భావనలు తన మనసులో లేవని, అలా ఉంటే ఇంత పెద్ద ప్రొజెక్ట్స్ లో పని చేయటం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతానికి ఆ భావనలు దరిచేరనివ్వనని, ప్రశాంతతో నటనకు న్యాయం చేయటమే తన భాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది.   అంటే ఈ మధ్య ఆమె ఒక సినీ నిర్మాతతో ప్రేమలో ఉన్నట్లు వచ్చే వార్తలలో నిజం లేదని తెలుస్తుంది.

Image result for beautiful anushka shetty latest images

మరింత సమాచారం తెలుసుకోండి: