సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు చేసే పని చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. కొన్ని సార్లు ప్రకృతి విపత్తులు సంబవించిన సమయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి ప్రజలకు అండగా ఉంటుంది. ఆ మద్య చెన్నైలో వచ్చిన జల ప్రళయానికి ప్రజలు తల్లడిల్లి పోయే సమయంలో కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో చేయూతను ఇచ్చాయి. ఇలా దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ప్రభుత్వానికి పరోక్షంగా సహాయ సహకారాలు అందజేస్తుంటారు సినిమావాళ్లు. ఇక హీరోల కు సంబంధించి అభిమాన సంఘాలు చేసే సేవా కార్యక్రమాల గురించి వేరే చెప్పనవసరం లేదు.

తాజగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ చేస్తున్న పనికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ముంబై లో మధ్యతరగతి వాళ్ళ కోసం హీరో వివేక్ ఒబెరాయ్ నడుం బగించాడు. ముంబై లాంటి మహానగరంలో చిన్న ఇల్లు ఉంటే జీవితం ధన్యమైతుందని అనుకుంటారు అందరూ..అలాంటి కల నెరవేర్చుకోవడం కోసం ఎన్నో ఏళ్ల పాటు కష్టాలు పడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారి కల నెరవేర్చడం కోసం వివేక్ ఒబెరాయ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు.  ప్రతి మద్య తరగతి వాళ్ళకు సొంత ఇళ్లు  అందుబాటు లో ఉండాలని భావించిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ కేవలం 8 లక్షలకే సొంతిల్లు కల సాకారం అయ్యేలా చేస్తున్నాడు.
Image result for rakta charitra
దాదాపు 5 లక్షల ఇళ్ళను కట్టి ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాడు వివేక్ . మధ్యతరగతి వాళ్ళకు లాభం చేకూర్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు వివేక్ ఒబెరాయ్.  తెలుగులో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్రతో తెలుగు వారికి కూడా మంచి పరిచయం అయ్యారు వివేక్. సినిమాల్లో డబ్బు సంపాదించి ఇనప్పెట్టె లో పెట్టుకోకుండా ప్రజలకు కొంత సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఈ హీరోని హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: