తమన్నా లేటెస్ట్ గా నటిస్తున్న ‘అభినేత్రి’ మూవీ పై చాల పెద్ద ఆశలే పెట్టుకుంది. తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి నిర్మింపబడి అక్టోబర్ 7న దసరా రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ సినిమాను తమన్నా అన్ని ప్రాంతాలలోను ప్రమోట్ చేస్తూ ఈసినిమాకు భారీ కలక్షన్స్ రాబట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది తమన్నా. 

ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ‘అభినేత్రి’ సినిమా విషయాలను తెలియచేస్తూ మధ్యలో ‘బాహుబలి’ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయమై మరో ట్విస్ట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ‘బాహుబలి’ విడుదలై ఏడాది గడిచి పోయినా ఎవరికీ సమాధానం దొరకని ఈ  ప్రశ్నకు తమన్నా ఇచ్చిన మరో ట్విస్ట్ అత్యంత ఆ శక్తి దాయకంగా మారింది.

‘బాహుబలి’ లో అవంతికగా మెరిసిన తమన్నా నిన్న జరిగిన ఆ మీడియా ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ కట్టప్ప సీన్ గురించి సమాధానాలు చెప్పే విషయంలో దాట వేయడానికి తన వంతు ప్రయత్నాలు చాల చేసింది.  అయితే ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న ఆ మీడియా సంస్థ ప్రతినిధి పట్టుపట్టి ఒకటికి రెండు సార్లు అదే ప్రశ్న అడుగుతూ ఉండటంతో తప్పించుకోలేని తమన్నా ఇచ్చిన ట్విస్ట్ ఆ కార్యక్రమం చూస్తున్న వారికి షాక్ ఇచ్చింది. 

కట్టప్ప ‘బాహుబలి’ ని ఎందుకు చంపాడో  ఎప్పుడు చంపాడో తనకు కూడా తెలీయదు అంటూ ఆసీన్ తీసేడప్పుడు తాను షూటింగ్ స్పాట్ లో లేను అంటూ మరో ఊహించని విషయాన్ని బయట పెట్టింది.  తనకు తెలిసినంత వరకు ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసే సమయానికే ‘బాహుబలి’ ని కట్టప్ప చంపేసాడు అంటూ ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి మైండ్ బ్లాంక్ చేసింది తమన్నా.  

ఈ మధ్య రాజమౌళి ‘బాహుబలి 2’ క్లైమాక్స్ ను చిత్రీకరిస్తూ మధ్యలో కట్టప్ప బాహుబలిని  ఎందుకు చంపాడు అన్న విషయానికి క్లారిటీ ఇస్తూ సుమారు నాలుగు రకాల సీన్స్ తీసాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తమన్నా ఇలాంటి కామెంట్స్ చేసిందా ? లేదంటే తమన్నా చెపుతున్నట్లుగా ఈ సీన్ చిత్రీకరణ ‘బాహుబలి’ పార్ట్ వన్ సమయానికే పూర్తి అయిందా అని అనిపించడం సహజం.

అయితే తమన్నా రాజమౌళిని  మించిన తెలివితేటలతో ఈ సస్పెన్స్ ను కొనసాగిస్తూ తన అభినేత్రి ప్రమోషన్ ను చాల గట్టిగా చేస్తూ దసరా రేస్ విజేతగా మారి తాను గ్లామర్ పాత్రలకే కాదు యాక్షన్ సినిమాలకు కూడ సరిపోతాను అన్న సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: