చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ని ఎట్టి పరిస్తుతులలోను 100 కోట్ల బిజినెస్ టార్గెట్ గా మార్చాలని మెగా కాంపౌండ్ ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యం తెలిసిందే.  అయితే ఊహించని ఉప్పెనలా బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మార్కెట్ విషయంలో బయటకు వస్తున్న వార్తలు మెగా కాంపౌండ్ కు అనుకోని షాక్ ను ఇచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సీడెడ్ ప్రాంత హక్కులను ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయికి 9 కోట్ల భారీ మొత్తానికి అమ్మినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఒక చారిత్రాత్మక సినిమాకు ఇంత భారీ స్థాయిలో బిజినెస్ డీల్ జరగడం షాకింగ్ న్యూస్ అంటున్నారు.  అంతేకాదు ఏ ధైర్యంతో కొర్రపాటి సాయి ఇంత పెద్ద సాహసం చేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ కూడ చేస్తున్నారు.  

అయితే ఈ భారీ డీల్ వెనుక బాలకృష్ణ మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు.  ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మాణం కూడ చేస్తున్న క్రిష్ ‘గౌతమీపుర్త శాతకర్ణి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వినోద పన్ను మినహాయింపు కోరుతూ ఇప్పటికే ఒక విజ్ఞాపన ఇచ్చాడని దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిని ఒకప్పుడు ధాన్యకటకం పేరుతో పరిపాలించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చరిత్ర అందరికీ తెలియాలి అన్న ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసినిమాను ప్రోత్సహించబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలే నిజం అయితే వినోదపు పన్ను సమస్య ఈ సినిమాకు ఉండదు కాబట్టి ఈసినిమాకు మరింత ఫ్యాన్సీ ఆఫర్లు బయ్యర్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాలకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. 

దీనిని బట్టి చూస్తూ ఉంటే చరణ్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ బిజినెస్ పూర్తి చేయకుండానే బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ బిజినెస్ మంచి ఫ్యాన్సీ రేట్లకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.  దీనికితోడు ఈసినిమా అన్ని ఏరియాల హక్కులను బాలయ్యకు సన్నిహితులుగా మెలిగే బయ్యర్లకు అమ్మే విధంగా బాలకృష్ణ చాల వ్యుహాత్మకమైన స్కెచ్ వేస్తున్నాడు అని టాక్.

ఈ వ్యూహం వల్ల ‘గౌతమీపుత్ర శాతకర్ణి ‘ సినిమాకి మంచి మార్కెట్ వచ్చే విధంగా బాలకృష్ణ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాజకీయంగా తనకున్న పలుకు బడిని కూడ ఈ సినిమాకు ఉపయోగిస్తూ భారీ రికార్డుల పై కన్నేశాడు అన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయాలు అన్నీ మెగా కాంపౌండ్ దృష్టికి రావడంతో చిరంజీవి 150వ సినిమా మార్కెట్ విషయంలో మారింత వేగం పెంచాలని మెగా కాంపౌండ్ తన ఎత్తుగడలకు మరింత పదును పెడుతున్నట్లు టాక్..
 



మరింత సమాచారం తెలుసుకోండి: