జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది యూత్‌కు. పవన్ సినిమా టైటిల్స్ పడుతున్నప్పటి నుంచి మొదలయ్యే అల్లరి బయటకు వచ్చే వరకు కొనసాగుతోంది. అంత జోష్ ఉంటుంది పవర్ స్టార్ మూవీ అంటే. ఒక్క మూవీ అనే కాదు. ఆయనకు సంబంధించి ఏ వార్త వచ్చిన జనాలకు ఆటోమెటిక్ గా పవర్ వచ్చేస్తోందనుకోండి అది వేరే విషయం. అయితే పవన్ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తున్నా తన దగ్గర చిల్లిగవ్వ లేదని ఇటీవలే చెప్పుకొచ్చాడు. అది నిజమేనంటున్నాడు మరో మెగా బ్రదర్ నాగబాబు.