తాప్సీ-తమిళ హీరో మహత్ మధ్య ఏదో ఉందని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇటు తాప్సీ గానీ, అటు మహత్ కానీ ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. అయితే తాజాగా తమ మధ్య ఉన్న బంధం గురించి మహత్ వెల్లడించాడు. తాప్సీని తాను ఇష్టపడ్డానని, ఇద్దరం కలిసి రెండు సంవత్సరాలు డేటింగ్ కూడా చేశామని మహత్ వెల్లడించాడు. అయితే తమ ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేవని మహత్ తెలిపాడు. ఇప్పుడు తన దృష్టి సినిమాలపైనే ఉందని మహత్ అన్నాడు. మహత్ నటించిన ‘బ్యాంక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మహత్ మీడియాతో మాట్లాడుతూ తాప్సీ గురించి విలేకరుల అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానం చెప్పాడు. ‘బ్యాంక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాకు మధుర శ్రీధర్ దర్శకత్వం వహించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: