సిక్స్ ప్యాక్ సునిల్ హీరోగా భారీగానే ఖర్చుపెట్టి తీసిన పెళ్లికొడుకు మొదటివారంలో ఎలాగోలా లాక్కోచ్చేస్తాడులే అనిపించినా... రెండోవారం వచ్చేసరికే సాంతం బొజ్జున్నట్టు కనిపిస్తుంది. సగానికిపైగా థియేటర్లలో బొమ్మతీసేస్తే... ఉన్న థియేటర్లలో కనీసం పావువంతైన నిండక నిర్మాత, డిస్ట్ర్రిబ్యూటర్లు తలపట్టుకు కూర్చున్నారటా! ఇక మన మంచు లక్ష్మీ గారి ‘గుండెల్లో గోదారి’ సినిమా అయితే చాలామంది అబ్బో ఏం తీస్తేరి! ఏం తీస్తిరి! అని ఆకాశానికెత్తేసినా... నీళ్లు లేక గోదారితల్లి ఎండి నెర్రలు పడినట్టే థియేటర్లలో కూడా అక్కడక్కడ జనాలు కనబడుతున్నారంట. ఎన్ని కోట్లెట్టి ఎంత కాళాత్మకంగా తీసినా... చివరాఖరకు... యాభై రూపాయలెట్టి ఆ సినిమాను చూసే ఆడియన్ కు నచ్చకపోతే ఇంతే అవుద్ది. ఏమంటారు మాస్టారు?

మరింత సమాచారం తెలుసుకోండి: