ప్రభాస్ ‘బాహుబలి’ కోసం తన బాహువులను మరింత బలంగా పెంచే పనిలో ఉన్నాడు. నిపుణుల సమక్షంలో ప్రతీరోజూ వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ మేరకు ఆహారపు అలవాట్లను కూడా కాస్త మార్చుకున్నాడు. ఇటీవలే ఓ సందర్భంలో తాను సినిమాల్లోకి రాకపోయుంటే శరీరం ఎలా ఉండేదో’ అని సరదాగా ఓ మిత్రుడితో ఇలా చెప్పాడట. ‘మామూలుగానే నాకు చాలా బద్దకం. చిన్నప్పట్నుంచీ అంతే. సినిమాల్లోకి వచ్చాను కాబట్టి నా బాడీ ఇలా ఉంది. ఫిట్ నెస్ ఇక్కడ ఎంతో ముఖ్యం కాబట్టి వ్యాయామాలు చేస్తున్నాను. అదే, నేను నటుడిని కాకపోయుంటే ఈపాటికి ఇంత పొట్టేసుకుని బాగా లావెక్కేసి ఉండేవాణ్నేమో. అమ్మో ఆ ఆకారం తల్చుకుంటేనే భయమేసేస్తోంది. థాంక్ గాడ్... సినిమాల్లోకి వచ్చి బతికిపోయాను’ అన్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: