కొణెదల వారి కోడలు ఉపాసన అన్న విషయం తెలిసిందే. ఈ ఉపాసన తన శ్రీవారు రామ్ చరణ్ కు జన్మదిన కానుకకు ఒక ఖరీదైన కుక్కను బహుకరించిందన్న వార్త ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నెల 27న జన్మదినం జరుపుకుంటున్న రామ్ చరణ్ కు  ధాయలాండ్ నుంచి తెప్పించిన ‘జాక్ రస్సెల్’ అనే జాతికి చెందిన కుక్కను ఉపాసన బహుకరించింది. ఈ కుక్క చాలా ఖరీదయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే అంతకు ముందు రామ్ చరణ్ తన అర్థాంగికి ఆమె జన్మదిన కానుకగా ఒక అశ్వాన్ని బహుకరించాడు. విదేశాల నుంచి తెప్పించిన గుర్రం కూడా చాలా ఖరీదయ్యిందే. అయితే ఇప్పుడు ఉపాసన కుక్కను బహుమతిగా ఇవ్వడమే  కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. గుర్రాన్ని బహుమతిగా ఇచ్చిన శ్రీవారికి ఎ ఆఫ్రికా ఏనుగునో... సింహాన్నో... బహుమతిగా ఇవ్వాలి కానీ... ఇలా కుక్కను బహుమతిగా ఇవ్వడమేంటనే ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: